Gajendra Singh Shekhawat : అవినీతి మయం కాళేశ్వరం – షెకావత్
కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్
Gajendra Singh Shekhawat : టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. మరో వైపు ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఓ వైపు సీఎం కేసీఆర్ మరింత దూకుడు పెంచారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా మరింత మాటల దాడులకు దిగింది.
ఇందులో భాగంగానే కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్(Gajendra Singh Shekhawat) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందని సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ అబద్దాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సరైన అనుమతులు తమ వద్ద నుంచి తీసుకోకుండానే ప్రాజెక్టు నిర్మించారని అన్నారు.
కోట్లాది రూపాయలు నీళ్ల లాగా ఖర్చు చేశారంటూ నిప్పులు చెరిగారు గజేంద్ర షెకావత్. భారీ వర్షాల దెబ్బకు కాళేశ్వరం ప్రాజెక్టు లోని 3 పంప్ హౌజ్ లు పూర్తిగా మునిగి పోయాయని మండిపడ్డారు.
ప్రజలకు చెందిన డబ్బులను ఎవరి కోసం ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పంప్ లను సాంకేతికంగా సరైన పద్దతిలో అమర్చ లేదన్నారు. ప్రాజెక్టు నిర్మించిన సమయంలోనే వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు గజేంద్ర షెకావత్.
అంత భారీ ఎత్తున ఖర్చు చేసిన పంప్ లు , విద్యుత్ మోటార్లు ఎలా పనికి వస్తాయంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి. పంప్ ల మరమ్మత్తుల లోనూ అవినీతి జరిగే ఆస్కారం ఎక్కువగా ఉందన్నారు.
Also Read : నేను సోనియాకు మాత్రమే ఏజెంట్ ని
