Basavanna : ఎందరికో ఆదర్శం ఈ ‘బసవన్న’
ఎవరీ బసవన్న ఏమిటా కథ
Basavanna : భారత దేశంలో మైనింగ్ వ్యాపారంలో కింగ్ పిన్ గా పేరొందారు కర్ణాటకకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి. ఇవాళ ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. 20 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీతో కొనసాగిస్తూ వచ్చిన రాజకీయ బంధానికి గుడ్ బై చెప్పారు. డిసెంబర్ 26 ఆదివారం కళ్యాణ రాజ్య ప్రజా పక్షం అనే పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు.
ఇది కుల, మతాలకు అతీతంగా ప్రజలందరి కోసం పని చేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీకి సామాజిక సంఘ సంస్కర, కోట్లాది మంది కన్నడిగులకు ఆరాధ్య దైవమైన బసవన్న ఆదర్శమని స్పష్టం చేశారు గాలి జనార్దన్ రెడ్డి. దీంతో ఎవరీ బసవన్న. ఎందుకంతటి ప్రాధాన్యత అన్నది తెలుసు కోవాల్సిన అవసరం ఉంది.
ఆయన 12వ శతాబ్దానికి చెందిన వారు. 1130లో కర్ణాటక లోని బసవన్న(Basavanna) బాగేవాడిలో పుట్టారు బసవన్న. భారతీయ రాజనీతుజ్ఞుడు, తత్వవేత్త, కవి, శివ కేంద్రీకత భక్తి ఉద్యమంలో లింగాయత్ లకు సంబంధించిన సన్యాసి. కళ్యాణి చాళుక్య, కలచూరి రాజవంశం పాలనలో హిందూ శైవ సంఘ సంస్కర్త.
బసవన్న రెండు రాజ వంశాల పాలనలో చురుకైన పాత్ర పోషించాడు. బిజ్జల రాజు కాలంలో కీలక పదవులు చేపట్టారు. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలో బసవన్న జీవితం, ఆలోచనల గురించి వివరించారు. బసవన్న కవిత్వం ద్వారా సామాజిక అవగాహనను వ్యాపింప చేశాడు.
ఆయన లింగం లేదా సామాజిక వివక్ష, మూఢ నమ్మకాలు, ఆచారాలను తిరస్కరించాడు. అనుభవ మంటపాన్ని ఏర్పాటు చేశాడు బసవన్న. శైవ మత సంప్రదాయం ఉన్న కుటుంబంలో పుట్టాడు. భక్తి ఉద్యమాన్ని అభివృద్ది చేశాడు. వ్యక్తిగత ఆరాధనను వద్దన్నాడు. అందరి క్షేమం కోరాడు బసవన్న. మరోసారి బసవన్న గాలి జనార్దన్ రెడ్డి ద్వారా హాట్ టాపిక్ గా మారారు.
Also Read : గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ