Gampa Govardhan : సీఎం కేసీఆర్ కోసం పదవీ త్యాగం
కామారెడ్డి ఎమ్మెల్యే గంగ గోవర్దన్
Gampa Govardhan : కామారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరు కూడా తమ పదవిని వదులు కోరని ఈ పరిస్థితుల్లో. కానీ తాను ఎమ్మెల్యే పదవి వదులు కునేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ కోసం అవసరమైతే పదవిని త్యాగం చేసేందుకు రెడీగా ఉన్నానని స్పష్టం చేశారు గంప గోవర్దన్.
Gampa Govardhan Comments
గతంలో పలుమార్లు కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తాను కేసీఆర్ ను కలిసి కోరారని చెప్పారు. బుధవారం జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్యే గంప గోవర్దన్(Gampa Govardhan) ప్రసంగించారు. సీఎం కింద సామాన్య కార్యకర్తగా ఉండేందుకు సిద్దమై ఉన్నానని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సర్పంచ్ పదవిని కూడా ఎవరూ వదులు కునేందుకు సుముఖత చూపరని అన్నారు ఎమ్మెల్యే.
కానీ తాను కేవలం కేసీఆర్ మీద ఉన్న గౌరవం, అభిమానం కారణంగా తనను గెలిపించిన ఎమ్మెల్యే పదవిని సైతం వద్దని అనుకుంటున్నానని పేర్కొన్నారు. రాదని అనుకున్న తెలంగాణను తీసుకు వచ్చిన అరుదైన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఆయన లేక పోతే తెలంగాణ రాష్ట్రం ఇవాళ సాకారం అయి ఉండేది కాదన్నారు. ఇదంతా కేసీఆర్ చలవేనని అన్నారు గంప గోవర్దన్.
ఇదిలా ఉండగా కామారెడ్డి ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఒకవేళ కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే తమ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ది చెందుతుందని ఇక్కడి నియోజకవర్గ ప్రజలతో పాటు గంప గోవర్దన్ కోరుతుండడం విశేషం.
Also Read : Akunuri Murali : గద్దరన్నను అవమానించిన కేసీఆర్