Mallikarjun Kharge : ‘గాంధీలు’ పార్టీని డిక్టేట్ చేయ‌రు – ఖ‌ర్గే

సంప్ర‌దించాకే తుది నిర్ణ‌యం ఉంటుంది

Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష బ‌రిలో ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు (ఎంపీ ) మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌కు పోటీదారుడిగా తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ పోటీలో ఉన్నారు. అక్టోబ‌ర్ 17న ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 19న ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. ప్ర‌ధానంగా గాంధీ ఫ్యామిలీకి న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా పేరొందారు ఖ‌ర్గే.

20 ఏళ్ల త‌ర్వాత గాంధీయేత‌ర వ్య‌క్తి కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఎన్నిక కాబోతున్నారు. ఇక మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే తో పాటు శ‌శి థ‌రూర్ నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌చారం చేప‌డుతున్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోక పోయిన‌ప్ప‌టికీ త‌మ‌ను గెలిపిస్తే ఏం చేస్తామ‌నే దానిపై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ మ‌రింత ర‌క్తి క‌ట్టిస్తున్నారు.

ఇదిలా ఉండగా సోనియా గాంధీ ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్నాయి ఖ‌ర్గేకు. ఇక అస‌మ్మ‌తి వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా ముద్ర ఉంది శ‌శి థ‌రూర్ కు. ఈ నేప‌థ్యంలో మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge) జాతీయ మీడియాతో గురువారం మాట్లాడారు. గాంధీ కుటుంబం పార్టీ నిర్ణ‌యాల‌లో జోక్యం చేసుకోర‌ని అన్నారు.

అదంతా అబ‌ద్ద‌మ‌ని కొట్టి పారేశారు. పార్టీ అంటేనే అంద‌రి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ముందుకు న‌డుస్తుంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. గాంధీలు పార్టీని డిక్టేట్ చేయ‌ర‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. అయితే పార్టీకి సంబంధించి మేలు చేసే ప్ర‌తి దాని కోసం ప్ర‌య‌త్నం చేస్తార‌ని తెలిపారు.

ఈ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. కాగా మొత్తం 9,000 మంది స‌భ్యులు క‌లిగిన పార్టీలో అధ్య‌క్షుడిని ఎన్నుకోబోతున్నారు.

Also Read : కాంగ్రెస్ చీఫ్ గా ఎన్నికైతే పెను మార్పులు

Leave A Reply

Your Email Id will not be published!