Ganga Sagar Mela : పశ్చిమ బెంగాల్ లో పేరొందిన గంగాసాగర్ మేళా ప్రారంభమైంది. లక్షలాది మంది యాత్రికులు పవిత్ర స్నానం చేసేందుకు విచ్చేస్తారు. గత వారం రోజుల్లో కరోనా మహమ్మారి ప్రభావం పెరిగింది.
దీంతో కోల్ కతా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. కోవిడ్ మార్గదర్శకాలు భక్తులు, యాత్రికులు పాటించేలా చూడాలని స్పష్టం చేసింది.
ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం కంటే ముందే గంగాసాగర్ మేళా (Ganga Sagar Mela )ప్రారంభమవుతుంది. యాత్రికులు, భక్తులు, పర్యాటకులు గంగ, బంగాళా ఖాతం సంగమంలో పవిత్ర స్నానం చేస్తారు.
అనంతరం కపిల ముని ఆలయంలో పూజలు చేస్తారు. ఇదిలా ఉండగా గంగాసాగర్ మేళా(Ganga Sagar Mela )శనివారంతో ప్రారంభమై ఈనెల 16 వరకు కొనసాగుతుంది.
తాము అన్ని చర్యలు తీసుకుంటామని కోర్టుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం విన్నవించింది. ఈ మేరకు ఈనెల 7న హైకోర్టు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
అయితే భక్తులు గంగా సాగర్ మేళాలో స్నానం చేశాక కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది కోర్టు.
ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ఎస్. ఎన్. ముఖర్జీ వాదిస్తూ గంగా సాగర్ మేళా కోసం వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కరికీ మరోసారి అక్కడికక్కడే కరోనా టెస్ట్ చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఏజే వాదనలు విన్న కోర్టు సంతృప్తిని వ్యక్తం చేస్తూ పర్మిషన్ ఇచ్చింది.
Also Read : మోదీకి టీటీడీ పూజారుల ఆశీర్వాదం