Punjab CM : గ్యాంగ్‌స్టర్ లది జాతీయ సమస్య – భగవంత్ మాన్
సంచలన కామెంట్స్ చేసిన పంజాబ్ సీఎం
Punjab CM : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన కామెంట్స్ చేశారు. నేర సంస్కృతి రోజు రోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా దేశ వ్యాప్తంగా ఈ నేరగాళ్లు విచ్చలవిడిగా తిరుగుతున్నారని మండిపడ్డారు.
వారికి అడ్డు కట్ట వేసేందుకు అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గ్యాంగ్ స్టర్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం. గ్యాంగ్ స్టర్ లది జాతీయ సమస్యగా ఆయన అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు దీనిని నియంత్రించేందుకు ఎక్కువగా ఫోకస్ పెట్టాలని భగవంత్ మాన్ సూచించారు.
ఇదిలా ఉండగా వీరి సంఖ్య పంజాబ్ లో ఎక్కువగా ఉందని , గతంలో ఏలిన పాలకుల నిర్వాకం వల్లనే ఇదంతా చోటు చేసుకుందని ఆరోపించారు. తాము వచ్చాక పంజాబ్ రాష్ట్రాన్ని నేర రహిత, అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు.
ఎవరు ఏ స్థాయిలో ఉన్నా నేరస్తులను, గ్యాంగ్ స్టర్లను పట్టుకుని తీరుతామని హెచ్చరించారు. హింసను తాము ఎప్పటికీ క్షమించే ప్రసక్తి లేదన్నారు సీఎం.
అంతే కాకుండా శ్రీ గురు గ్రంథ సాహిబ్ జీ పై హత్యాకాండకు పాల్పడిన వారిని కటకటాల వెనక్కి నెట్టేంత వరకు తాను నిద్ర పోనని హెచ్చరించారు భగవంత్ మాన్(Punjab CM).
ఇన్నేళ్లు గడిచినా ఇంత దారుణమైన నేరానికి పాల్పడిన వారు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతుండడం దారుణమన్నారు. అంతే కాకుండా ప్రజా ధనాన్ని దోచుకున్న వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు.
ఇప్పటికే గతంలో పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారంటూ ధ్వజమెత్తారు సీఎం.
Also Read : నేను కోరుకుంటే సీఎం కానీ శివసేనకు పట్టం