Gangsters Shooters Arrest : గ్యాంగ్ స్టర్ల హంతకుల గుర్తింపు
ఆ ముగ్గురి వివరాలు తెలియవు
Gangsters Shooters Arrest : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్స్ మాజీఎంపీ అతిక్ అహ్మద్ , సోదరుడు అష్రఫ్ అహ్మద్ లు ప్రయాగ్ రాజ్ లో మీడియాతో మాట్లాడుతుండగానే చంపబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. వీరు అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. దాడికి పాల్పడిన ఆ ముగ్గురిపై నేర చరిత్ర ఉందని స్పష్టం చేశారు. అయితే ఈ హంతకులతో తమకు ఎలాంటి సంబంధం లేదని కుటుంబీకులు చెప్పడం విశేషం. కరుడు గట్టిన నేరస్థులుగా మారాలని అనుకుని ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.
గత రాత్రి జరిగిన ఈ ఘటన తర్వాత కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ముగ్గురిని అదుపులోకి(Gangsters Shooters Arrest) తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారు లోవ్లేష్ తివారీ, సన్నీ సింగ్ , అరుణ్ మౌర్యగా గుర్తించినట్లు చెప్పారు. నేరానికి పాల్పడిన వారి పూర్వ చరిత్రను వెతికి తీస్తున్నట్లు తెలిపారు.
ఈ ముగ్గురు విలేకరుల ముసుగులో వచ్చారని, నేరుగా కాల్పులకు తెగబడ్డారంటూ వెల్లడించారు. ప్రయాగ్ రాజ్ లో అతీక్ అహ్మద్ , అష్రఫ్ అహ్మద్ లు మీడియాతో మాట్లాడుతుండగా విలేకరులగా నటిస్తూ పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారు.
ముగ్గురిపై క్రిమినల్ రికార్డులు ఉన్నాయని తెలిపారు. ఇక లవ్లేష్ తివారీ జైలు పాలయ్యాడు. కొడుకుతో టచ్ లో లేమని చెప్పాడు తండ్రి యగ్య తివారీ. సన్నీపై 14 కేసులు నమోదై ఉన్నాయి. రౌడీ షీటర్ గా ప్రకటించినప్పటి నుండి పరారీలో ఉన్నాడని చెప్పారు పోలీసులు. మూడో షూటర్ అరుణ్ చిన్న తనంలోనే ఇంటి నుంచి వెళ్లి పోయాడు. 2010లో రైలులో ఒక పోలీసు హత్యకు సంబంధించి పేరు కనిపించింది.
Also Read : యూపీలో రెడ్ అలర్ట్ – సీఎం