Ganta Srinivasa Rao : జగన్ రెడ్డిపై గంటా కన్నెర్ర
మూడు రాజధానుల కథేంటి
Ganta Srinivasa Rao : విశాఖపట్నం – ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. గంటా శ్రీనివాస రావు(Ganta Srinivasa Rao) మీడియాతో మాట్లాడారు.
Ganta Srinivasa Rao Slams YS Jagan
ఏపీ సీఎం ఎన్నికల ముందు అమరావతినే ఏపీ రాజధాని ఆనాడు ప్రకటించారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మరిచి పోయారంటూ మండిపడ్డారు. మూడు రాజధానులు చేస్తామని తానే మాట మార్చారంటూ ఫైర్ అయ్యారు.
నిజంగా జగన్ మోహన్ రెడ్డికి దమ్ముంటే వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో 3 రాజధానుల అంశం పెట్టాలని డిమాండ్ చేశారు. కావాలని కక్ష సాధింపు ధోరణితో సీఎం వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు చూపలేదని ధ్వజమెత్తారు.
నిన్నటి దాకా ఏపీ స్కిల్ స్కాం కేసులో నారా లోకేష్ పేరు ప్రస్తావిస్తూ వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు ఉన్నట్టుండి కేసు నమోదు చేయలేదంటూ చెప్పారని ఫైర్ అయ్యారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ప్రభావం తెలంగాణ ఎన్నికలపై తప్పకుండా ఉంటుందన్నారు గంటా శ్రీనివాసరావు.
Also Read : Chandrababu Case : బాబు క్వాష్ పిటిషన్ పై విచారణ