Ganta Srinivasa Rao : తెలుగుదేశం విజ‌యం ఖాయం

మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు

Ganta Srinivasa Rao : విశాఖ‌ప‌ట్ట‌ణం – ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు. విశాఖ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తిరిగి టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు సీఎం అవుతార‌ని జోష్యం చెప్పారు.

Ganta Srinivasa Rao Comment

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు సంయుక్తంగా పోటీ చేస్తాయ‌ని, వైసీపీ చేస్తున్న అబ‌ద్దపు ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో జ‌నాన్ని బురిడీ కొట్టించారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న పూర్తిగా అరాచ‌క‌త్వంతో న‌డుస్తోంద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే సోయి లేకుండా పోయింద‌న్నారు గంటా శ్రీ‌నివాస‌రావు(Ganta Srinivasa Rao). ప్ర‌జ‌లు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో దిమ్మ తిరిగేలా తీర్పు ఇవ్వ‌బోతున్నార‌ని, జ‌గ‌న్ రెడ్డికి షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌న్నారు.

త‌మ కూట‌మి ఇక నుంచి రాబోయే 100 రోజుల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నామ‌ని ఈ మేర‌కు త‌మ పార్టీల శ్రేణులు క‌లిసిక‌ట్టుగా ముందుకు వెళ‌తాయ‌ని స్ప‌ష్టం చేశారు. వై నాట్ 175 అంటూ సంబుర ప‌డుతున్న వైసీపీ నేత‌ల‌కు ఝ‌ల‌క్ త‌ప్ప‌ద‌న్నారు. త‌మ కూట‌మికి క‌నీసం 100 సీట్ల‌కు పైగానే వ‌స్తాయ‌ని అన్నారు గంటా శ్రీ‌నివాస‌రావు.

Also Read : CM Siddarmaiah : సిద్ద‌రామ‌య్య షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!