Garuda Seva : శ్రీవారి ఆలయంలో గరుడసేవ
వైభవంగా అధిక మాసం శ్రావణ పౌర్ణమి
Garuda Seva : తిరుమల శ్రీవారి ఆలయంలో అధిక మాసం శ్రావణ పౌర్ణమి గరుడ సేవను(Garuda Seva) అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
Garuda Seva Vahana Seva
గరుడ వాహనం నిర్వహించడం సర్వ పాప ప్రాయశ్చిత్తంగా భక్తులు భావిస్తారు. దీని వెనుక పెద్ద పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ చెబుతారు.
అంతే కాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగి పోతాయని భక్త కోటికి స్వామి వారు తెలియ చెబుతున్నారు. ఇదిలా ఉండగా శ్రీవారి దర్శనం కోసం భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు. మరో వైపు మలయప్ప స్వామి రూపంలో దర్శనం ఇచ్చిన ఆ దేవ దేవుడు కలియుగ వైకుంఠ వాసుడు , శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలగడంతో భక్తులు ఆనందంతో ఉబ్బి తబ్బిబవుతున్నారు.
Also Read : Water ATMs Comment : పేదల నేస్తాలు వాటర్ ఏటీఎంలు