YS Jagan : ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ రెడ్డి తీవ్ర ఆవదేనకు లోనయ్యారు. మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తనను ఇప్పటికీ తేరుకోనీయకుండా చేసిందని వాపోయారు.
ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఇవాళ ఏపీ శాసనసభలో పలువురు పంచుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు గౌతమ్ రెడ్డి గొప్ప నాయకుడని, అంతకంటే మానవత్వం కలిగిన మంచి మనిషి అంటూ కొనియాడారు.
ఈ సందర్భంగా సీఎం అసెంబ్లీలో మాట్లాడారు. గౌతమ్ రెడ్డి లేడంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నా. ఎక్కడికి వెళ్లినా లేదా తన వద్దకు వచ్చినా ముందుగా అన్నా అని ఆప్యాయంగా పిలిచేవాడని గుర్తు చేసుకున్నారు సీఎం.
రెండో రోజు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తరపున జగన్ రెడ్డి (YS Jagan)సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. గౌతమ్ రెడ్డి తనకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడని చెప్పారు. ఒక రకంగా ఆయన మరణం పార్టీకి, తనకు , రాష్ట్రానికి తీరని లోటుగా అభివర్ణించారు.
ఏం మాట్లాడాలో తెలియకుండా ఉందన్నారు. చాలా సందర్భాలలో తనకు అండగా నిలిచాడని పేర్కొన్నారు జగన్ రెడ్డి. తాను అప్పగించిన బాధ్యతలను వంద శాతం నెరవేర్చాడని కొనియాడారు.
రాష్ట్రంలో కొత్త కంపెనీలు వచ్చేలా ఎనలేని కృషి చేశాడని చెప్పారు సీఎం. గౌతమ్ రెడ్డి కన్న కలలు నెరవేర్చేందుకు తాను కృషి చేస్తానని అన్నారు సీఎం.
సంగం బ్యారేజీ పనులను ఆరు వారాల్లో పూర్తి చేస్తామని, గౌతమ్ రెడ్డి పేరు ఆ ప్రాజెక్టుకు పెడుతున్నట్లు సభా సాక్షిగా ప్రకటించారు జగన్ రెడ్డి.
Also Read : సిఎం సర్… మీరు మరచినా … గూగుల్ మరవదుగా….