Gehraiyaan: భావోద్వేగాల స‌మ్మేళ‌నం ‘గెహ్రైయాన్’

హ‌ద్దులు మీరిన ప‌దుకొనే, చ‌తుర్వేది సీన్స్

Gehraiyaan :  దేశ వ్యాప్తంగా మ‌రో సంచ‌ల‌నాత్మ‌కంగా మారింది దీపికా ప‌దుకొనే , సిద్దాంత్ చ‌తుర్వేది క‌లిసి న‌టించిన గెహ్రైయాన్. ప్ర‌స్తుతం ట్రైల‌ర్ విడుద‌లైంది. దీనిపై భారీ ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే క‌పూర్ అండ్ స‌న్స్ తీసిన శ‌కున్ బాత్రా గెహ్రైయాన్(Gehraiyaan: )పేరుతో మూవీ తీశాడు. ఇందులో నాసీరుద్దీన్ షా, అన‌న్య పాండే , త‌దిత‌రులు న‌టించారు. ఈనెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియ‌ర్ ను ప్ర‌ద‌ర్శించేందుకు సిద్దంగా ఉంది.

గెహ్రైయాన్ పూర్తిగా సంక్లిష్ట ఆధునిక సంబంధాల గురించిన డ్రామాగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ , వ‌యాకామ్ 18 స్టూడియోస్ , జౌస్కా ఫిల్మ్స్ తో క‌లిసి సంయుక్తంగా నిర్మించారు.

రిలేష‌న్ షిప్ డ్రామా. సంక్లిష్ట‌మైన ఆధునిక సంబంధాల లోతుల్లోకి ప్ర‌వేశించ‌డం. క‌లిసి ఉండ‌డం ఆ త‌ర్వాత విడి పోవ‌డం..జీవిత మార్గాన్ని నియంత్రించ‌డం, త‌దిత‌ర అంశాల‌ను స్పృశిస్తుంది ఈ మూవీ అని మేక‌ర్స్ వెల్లడించారు.

ఏక్ మైన్ ఔర్ ఏక్ తు ప్ర‌శంస‌లు పొందిన డ్రామా , క‌పూర్ అండ్ స‌న్స్ చిత్రాల‌కు పేరుగాంచిన బాత్రా మాన‌వ భావోద్వేగాల సంక్లిష్ట‌త‌ల‌ను చిత్రీక‌రించ‌డంలో అద్బుతంగా ప‌ని చేశాడ‌ని కితాబు ఇచ్చాడు చిత్ర నిర్మాత క‌ర‌ణ్ జోహార్.

ఓవ‌ర్ ఆల్ గా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ద‌ర్శ‌కుడు మూవీని తీశాడ‌ని పేర్కొన్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఈ ప్ర‌యాణాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉంద‌న్నాడు ద‌ర్శ‌కుడు. ప్రేక్ష‌కులు త‌ప్ప‌క ఈ చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కంతో అన్నారు.

Also Read : స్విస్ టూర్ లో స‌మంత బిజీ

Leave A Reply

Your Email Id will not be published!