Atreyapuram Pootharekulu : పూత రేకుల‌కు భౌగోళిక గుర్తింపు

ఆత్రేయ‌పురం అరుదైన ఘ‌న‌త‌

Atreyapuram Pootharekulu : పూత రేకులు అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ఆత్రేయ‌పురం. రెండు తెలుగు రాష్ట్రాల‌లోనే కాదు దేశ వ్యాప్తంగా, ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత పేరు పొందాయి ఇక్క‌డి నుంచి త‌యారు చేసిన పూత రేకులు. తాజాగా ఆత్రేయ‌పురం పూత రేకుల‌కు అరుదైన గుర్తింపు ల‌భించింది. ఏకంగా భౌగిళిక ప‌ర‌మైన గుర్తింపు ద‌క్కింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలోని డిపార్ట్ మెంట్ ఫ‌ర్ ప్ర‌మోష‌న్ ఆఫ్ ఇండ‌స్ట్రీస్ అండ్ ఇంట‌ర్న‌ల్ ట్రేడ్ జియోగ్రాఫిక‌ల్ ఇండికేష‌న్స్ రిజిస్ట్రీలో పూత రేకులు న‌మోద‌య్యాయి.

త‌యారు చేసిన వాటికి సంబంధించి గుర్తింపు ఇవ్వ‌డం ప‌రిపాటి. ఇప్ప‌టికే ఆత్రేయపురం పూత రేకులకు భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. పూత రేకులు ప్రియులు ఎక్కువ‌గా ఆత్రేయ పురంలో త‌యారైన వాటినే ఇష్ట‌ప‌డ‌తారు. వాటిని తినేందుకు ప్ర‌యారిటీ ఇస్తారు. ఇదిలా ఉండ‌గా భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా ఆత్రేయ‌పురంకు చెందిన స‌ర్ ఆర్థ‌ర్ కాట‌న్ పూత రేకుల స‌హ‌కార సంఘం ద‌ర‌ఖాస్తు చేసింది.

దీనికి సంబంధించి కేంద్ర విభాగం. ఫిబ్ర‌వ‌రి 13న విడుద‌ల చేసిన జియో గ్రాఫిక‌ల్ ఇండికేష‌న్స్ (జీఐ) జ‌ర్న‌ల్ లో ఆత్రేయ పురం పూత రేకుల(Atreyapuram Pootharekulu) గుర్తింపుపై ప్ర‌క‌ట‌న చేసింది. అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌కు ఇచ్చిన గ‌డువు జూన్ 13 వ‌ర‌కు విధించింది. ఏ ఒక్క‌రు లేదా పూత రేకుల త‌యారీ సంఘాలు, త‌యారీదారులు, సంస్థ‌లు ఎలాంటి అభ్యంత‌రాలు తెలుప లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అభ్యంత‌రాలు రాక పోవ‌డంతో భౌగోళిక గుర్తింపు వ‌చ్చిన‌ట్ల‌యింద‌ని ఆర్థ‌ర్ కాట‌న్ పూత రేకుల స‌హ‌కార సంఘం వెల్ల‌డించింది.

Also Read : MK Stalin CBI : త‌మిళ‌నాడులో సీబీఐకి నో ఎంట్రీ

 

Leave A Reply

Your Email Id will not be published!