Ghulam Nabi Azad : గతంలో రాజులు కూడా ఇలా చేయలేదు
సోనియా గాంధీపై ఈడీ విచారణ దారుణం
Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీ రెబల్ నాయకుడిగా పేరొందిన గులాం నబీ ఆజాద్ ఇవాళ నోరు విప్పారు. ఆయన కేంద్ర సర్కార్ పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తూ వచ్చారు.
బుధవారం ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల, కేంద్ర దర్యాప్తు సంస్థల పోకడపై సీరియస్ కామెంట్స్ చేశారు. రాచరిక పాలన కాలంలో సైతం రాజులు కూడా ఇలా వ్యవహరించ లేదంటూ మండిపడ్డారు.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసు లో మూడు రోజుల పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది.
ఆమె వయస్సు ప్రస్తుతం 74 ఏళ్లు అని, దాని విషయంపై కూడా ఆలోచించకుండా ఎలా విచారణ చేపడతారని గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) ప్రశ్నించారు.
ఆమెను పదే పదే ప్రశ్నించే ముందు ఇవేవీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్నారు. సోనియా గాంధీ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని ఈ సమయంలో విచారణ చేయడం అవసరమా అని నిలదీశారు.
అవసరమైతే మరీ తప్పదని అనుకుంటే ఆమె ఇంటికి వెళ్లి విచారించే వెసులుబాటు కూడా ఉందన్నారు. ఇది చట్టంలో కూడా పొందు పరిచారని , ఆ విషయం తెలుసుకుని వుంటే బాగుండేదన్నారు ఆజాద్.
మొదటి రోజు నాలుగు గంటలు, రెండో రోజు ఆరు గంటలకు పైగా విచారించింది సోనియా గాంధీని ఈడీ. ఇవాళ విచారణ చేపట్టి వదిలి వేసింది.
ఇక రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయనను రోజుకు 10 గంటల నుంచి 12 గంటల దాకా ప్రశ్నించింది. దేనిని రాబట్ట లేక పోయింది.
Also Read : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పై వేటు