Ghulam Nabi Azad : మోదీ 24 గంటల రాజకీయ నేత – ఆజాద్
ప్రధానమంత్రిపై ప్రశంసల వర్షం
Ghulam Nabi Azad : కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీని 24 గంటల రాజకీయ నాయకుడు అని కితాబు ఇచ్చారు. అంతే కాదు వయసు పెరిగితే ఎవరైనా రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటారని కానీ మోదీ మాత్రం ఇంకా ఇంకా నవ యువకుడి లాగా పని చేస్తున్నారంటూ పేర్కొన్నారు గులాం నబీ ఆజాద్.
ఇదిలా ఉండగా మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత ఊహించని రీతిలో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మాజీ ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ చేసిన దానిలో కనీసం 50 శాతమైనా పని చేస్తే ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ బాగు పడేదని చురకలు అంటించారు. ఎంత సేపు నరేంద్ర మోదీని తిట్టడం వల్ల లాభం ఉండదని సూచించారు గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad).
రాహుల్ గాంధీ ఒంటెద్దు పోకడ, ఆయన నిర్వాకం కారణంగానే కాంగ్రెస్ పార్టీ లో చాలా మంది సీనియర్లు బయటకు వెళ్లి పోయారని, ప్రస్తుతం ఆ పార్టీ ఐసీయూలో ఉందన్నారు.
పాత పార్టీలో కొనసాగాలంటే వెన్నెముక లేని వ్యక్తిగా ఉండాల్సిందేనని లేక పోతే మనుగడ కష్టమన్నారు గులాం నబీ ఆజాద్. ప్రస్తుతం పార్టీకి మల్లికార్జున్ ఖర్గే చీఫ్ గా ఉన్నా ఫాయిదా లేదన్నారు. ఎవరు ఉన్నా రాహుల్ గాంధీ చేతిలోనే పార్టీ కొనసాగుతుందన్నారు.
Also Read : మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు