Ghulam Nabi Azad : మారిన ‘గులాం’ స్వరం
కాంగ్రెస్ పై కామెంట్స్
Ghulam Nabi Azad : మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ (డీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) సంచలన వ్యాఖ్యలు చేశారు. 137 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో 50 ఏళ్ల పాటు ఉన్న ఆజాద్ ఇటీవలే గుడ్ బై చెప్పారు. త్వరలో జమ్మూ, కాశ్మీర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నిలుస్తున్నారు.
కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన సోనియా గాంధీని ప్రశంసిస్తూనే ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా తాజాగా దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గులాం నబీ ఆజాద్. తాజాగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ తరుణంలో ఆజాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీని ఢీకొనలేవని పేర్కొన్నారు. ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం అని ప్రశంసలు కురిపించారు. పక్కా ప్లాన్ తో ప్రయత్నం చేస్తే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని ఓడించే సత్తా ఉందని అభిప్రాయపడ్డారు.
మరో వైపు ఆమ్ ఆద్మీ పార్టీకి అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఢిల్లీకి మాత్రమే పరిమితమై పోయిందని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ పంజాబ్ రాష్ట్రంలో పవర్ లోకి వచ్చిన ఆప్ అక్కడ ఒరగ బెట్టింది ఏమీ లేదన్నారు. ఇక లౌకితత్వం విషయంలో కాంగ్రెస్ పార్టీ తన పంథాను మార్చు కోలేదన్నారు.
తాను పార్టీని ఏర్పాటు చేసినంత మాత్రాన ఉన్న వాస్తవాన్ని మాత్రమే స్పష్టం చేసినట్లు తెలిపారు.
Also Read : అసత్య హామీలతో కమలం మోసం – రాజీవ్ శుక్లా