Ghulam Nabi Azad : జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరిగితే బెటర్
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్
Ghulam Nabi Azad : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన జమ్మూ , కాశ్మీర్ లో ఎన్నికలు జరిపితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad)చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పుడున్నంత హింస జరగక పోవచ్చన్నారు.
2019లో ఆర్టికల్ 370 రద్దు చేసింది మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్ లో డీలిమిటేషన్ ప్రక్రియ ముగిశాఖ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా గతంలో చెప్పారు.
ఎన్నికలు జరిగితే , అధికారం ప్రజల చేతుల్లోకి వస్తే అంతా సజావుగా, సవ్యంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు గులాం నబీ ఆజాద్. జమ్మూ కాశ్మీర్ లో సోదర సంస్కృతి ఎప్పటి లాగే ఉందన్నారు.
ఆయన తరచుగా కాశ్మీరియత్ అనే పదాన్ని ఉపయోగిస్తూ , పదే పదే వాడుతూ ఉంటారు. కశ్మీరియత్ గతంలో ఉన్నట్లే ఉంది. ఇందులో ఎలాంటి మార్పు లేదన్నారు.
ప్రజలు ఇప్పటికీ ఒకరినొకరు ప్రేమిస్తూనే ఉన్నారని చెప్పారు గులాం నబీ ఆజాద్. ప్రభుత్వం నోటిఫై చేసిన జమ్మూ కాశ్మీర్ పునర్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్ , లడఖ్ ల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.
నిర్దేశించిన చట్టం ప్రకారం జమ్మూ, కాశ్మీర్ లో శాసనభలో సీట్ల సంఖ్య 107 నుంచి 114కి పెరుగుతుంది. ఈ తరుణంలో ఆజాద్ కామెంట్స్ చేయడం చర్చకు దారి తీసింది.
Also Read : దేశాన్ని బీజేపీ విభజించి పాలిస్తోంది