Ghulam Nabi Azad : రాహుల్ గాంధీపై ఆజాద్ ఆగ్రహం
గాంధీ ఫ్యామిలీపై సీరియస్ కామెంట్స్
Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad)సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేశారు.
అంతే కాకుండా రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో అనుకోకుండా షాకిచ్చారు. అంతే కాకుండా రాహుల్ గాంధీ వల్లే పార్టీ నాశనం అవుతోందన్నారు గులాం నబీ ఆజాద్.
శుక్రవారం ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. ఈ మేరకు తాను ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చిందో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి , పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురించే ఎక్కువగా ప్రస్తావించారు ఆజాద్. కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాకే పూర్తిగా భ్రష్టు పట్టిందని ధ్వజమెత్తారు.
ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం అంటూ మండిపడ్డారు. ప్రత్యేకించి సీనియర్ లీడర్లను కావాలని పక్కన పెట్టేస్తూ వచ్చారని ఆరోపించారు.
ఇటీవల తనను జమ్మూ కాశ్మీర్ పార్టీ ప్రచార కమిటీ నియమించడాన్ని కూడా తప్పు పట్టారు. ఆయన ఆ పదవికి రిజైన్ చేశారు. ఇవాళ ప్రచార కమిటీ సారథి పదవితో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలుగా అసంతృప్తి గళం వినిపిస్తూ వచ్చారు. జీ23 గ్రూపును ఏర్పాటు చేశారు. గులాం నబీ ఆజాద్ కీలకంగా వ్యవహరించారు.
మరో వైపు రాజ్యసభ పదవీ కాలం ముగిసినా దానిని పొడిగించ లేదు ఏఐసీసీ సోనియా గాంధీ. దానిపై కినుక వహించారు.
Also Read : గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ కు గుడ్ బై