Ghulam Nabi Azad : గులాం న‌బీ ఆజాద్ కంట‌త‌డి

రాహుల్ గాంధీపై మండిపాటు

Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీలో సుదీర్గ బంధాన్ని తెంచుకున్నారు కేంద్ర మాజీ మంత్రి గులాం న‌బీ ఆజాద్(Ghulam Nabi Azad). పార్టీకి గుబ్ బై చెప్పిన ఆజాద్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఆపై తాను పార్టీ వీడుతున్నందుకు కంట త‌డి పెట్టారు. రాహుల్ గాంధీ, ఆయ‌న అనుచ‌రులు (సెక్యూరిటీ గార్డులు) తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగానే పార్టీ భ్ర‌ష్టు ప‌ట్టి పోయింద‌ని ఆరోపించారు.

ఈ మేర‌కు సుదీర్ఘ లేఖ రాశారు ఆజాద్. 2014 ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మికి పూర్తి బాధ్య‌త రాహుల్ గాంధీనేన‌ని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో సోనియా గాంధీని ప్ర‌శంసించారు.

జీ 23 గ్రూప్ లో ఆజాద్ కీల‌క‌మైన నేత‌గా ఉన్నారు. ఆయ‌న ప్ర‌ధానంగా రాహుల్ పైనే నిప్పులు చెరిగారు. పార్ట‌లో సంప్ర‌దింపుల యంత్రాంగం అనేది లేకుండా చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

దుర‌దృష్ట‌వ‌శాత్తు రాహుల్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక పార్టీ స‌ర్వ‌నాశ‌నం అయ్యింద‌న్నారు. సీనియ‌ర్ల‌ను, అనుభ‌వం క‌లిగిన వారిని ప‌క్క‌న పెట్టార‌ని, ఎలాంటి నిబ‌ద్ద‌త‌, అనుభవం లేని సైకో ఫాంట్ల‌తో కొత్త కోట‌రీకి తెర తీశార‌ని ఆరోపించారు ఆజాద్.

చిన్న పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌నే కొంప ముంచింద‌న్నారు. 2014 నుండి మీ నాయ‌క‌త్వంలో , ఆ త‌ర్వాత రాహుల్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో రెండు లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైంది.

2014-2022 మ‌ధ్య జ‌రిగిన 49 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 39 స్థానాల‌ను కోల్పోయింద‌న్నారు. పార్టీ కేవ‌లం నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింద‌ని గుర్తు చేశారు.

కేవలం రెండు రాష్ట్రాల‌లోనే అధికారంలో ఉండ‌డానికి కార‌ణం రాహుల్ గాంధీ అనుస‌రిస్తున్న వైఖ‌రి అంటూ ఆరోపించారు.

Also Read : రాహుల్ గాంధీపై ఆజాద్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!