Gita Gopinath : రిషితో గీతా గోపీనాథ్ ముచ్చట
జి20 సదస్సులో అరుదైన సన్నివేశం
Gita Gopinath : న్యూఢిల్లీ – భారత దేశానికి చెందిన ఇంటర్నేషనేల్ మోనిటరింగ్ ఫండ్ (ఐఎంఎఫ్) చీఫ్ గీతా గోపినాథ్ ప్రధాన ఆకర్షణగా మారింది. దేశ రాజధానిలో జరిగిన జి20 ప్రత్యేక సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలుసుకున్నారు.
Gita Gopinath Meet Rishi Sunak
ఆర్థిక అంశాలపై కూలంకుశంగా చర్చించారు. ఆయా దేశాలకు నిధులు మంజూరు చేయాలంటే ఐఎంఎఫ్ కీలకం. ఇందులో భాగంగా బ్రిటన్ ప్రధాన మంత్రి గా ఉన్న ప్రవాస భారతీయుడైన రిషి సునక్ ను గీతా గోపీనాథ్ కలుసుకున్నారు.
సుదీర్ఘ చర్చలు జరిపారు. స్వయంగా ఐఎంఎఫ్ చీఫ్ గీతా గోపీనాథ్(Gita Gopinath) ట్విట్టర్ వేదికగా ఫోటోలు పంచుకున్నారు. బ్రిటన్ పీఎంను కలుసు కోవడం ఆనందంగా ఉందన్నారు . 18వ జి20 సమ్మిట్ లో భాగంగా దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఆయా దేశాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
ఆదివారం దేశాధినేతలతో పాటు ఐఎంఎఫ్ చీఫ్ గీతా గోపీనాథ్ కూడా మహాత్ముడికి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రపంచానికి వెలుగును పంచిన మహోన్నత నాయకుడు గాంధీ అని పేర్కొన్నారు.
Also Read : PM Modi : మోదీతో ఇటలీ ప్రధాని మెలోనీ భేటీ