Mamata Banerjee : కేంద్ర దర్యాప్తు సంస్థలపై కోర్టుకు వెళతా
నిప్పులు చెరిగిన పశ్చిమ బెంగాల్ సీఎం
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం కావాలని వేధింపులకు దిగుతోందంటూ ఆరోపించారు.
దర్యాప్తు సంస్థలు, గవర్నర్లను అడ్డం పెట్టుకుని మోదీ త్రయం(PM Modi Ruling) ఇబ్బందులకు గురి చేయడం చేస్తూ వచ్చారంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్రం. తనకు నమ్మకస్తుడైన సీనియర్ మంత్రిగా ఉన్న పార్థ ఛటర్జీపై దాడికి దిగింది.
ఆయన సహాయకురాలి ఇంట్లో సోదాలు జరిపింది. ఏకంగా రూ. 50 కోట్ల నగదు 5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఆపై ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది.
మరో టీఎంసీ నాయకుడిని పుశువుల కుంభకోణంలో అదుపులోకి తీసుకుంది. ఇక బొగ్గు స్కాంకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారులను విచారణకు పిలిచింది.
ఇదే సమయంలో మమతా బెనర్జీకి అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్న మేనల్లుడు ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఆయన భార్యకు ఈడీ సమన్లు జారీ చేసింది.
వెంటనే హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న తీరుపై చట్ట బద్దంగా పోరాడుతామని స్పష్టం చేశారు మమతా బెనర్జీ(Mamata Banerjee) .
కుటుంబ సభ్యులకు సమన్లు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. అక్రమంగా ఆస్తులు సంపాదించేందుకు తాను ఎవరికీ సహాయం చేయలేదని చెప్పారు. ఇది పూర్తిగా కఠినమైన వ్యవహారం. న్యాయపరంగా వారితో పోరాడుతానని స్పష్టం చేశారు.
దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండ కూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపించారు సీఎం.
Also Read : గుజరాత్ సీఎంపై కేజ్రీవాల్ ఆగ్రహం