Godavari Floods : గోదావరి దెబ్బ వలస బాట
ప్రమాదకర స్థాయిని దాటిన నది
Godavari Floods : బంగళాఖాతం లో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలు నీట మునిగే పరిస్థితి నెలకొంది.
అంతకంతకూ గోదావరి ఉగ్ర రూపం దాల్చడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ రెడ్డి ఆదేశించారు. శనివారం ఏలూరు జిల్లా లోని వేలేరుపాడు, కుకునూరు మండలలా లోని గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరికొందరు బతుకు జీవుడా అంటూ తట్టా బుట్టా సర్దుకుని బయలు దేరారు.
Godavari Floods Viral
గోదావరి నదిలో నీటి మట్టం(Godavari Floods) పెరగడంతో ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలలో వరద ముప్పు ఏర్పడింది. మరో వైపు తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయిని దాటేసింది. 53 అడుగులను దాటి ప్రవహిస్తోంది.
రెవిన్యూ, పోలీస్, అగ్ని మాపక శాఖలకు చెందిన సిబ్బంది సహాయక చర్యలలో మునిగి పోయారు. మరో వైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మొత్తంగా ఇరు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. వణికిస్తున్నాయి. ఓరుగల్లు వాసులు లబోదిబోమంటున్నారు.
Also Read : Sanjay Dutt Leo : సంజయ్ దత్ లియో పోస్టర్ వైరల్