Godavari River Rises : గోదావరి 43.2 కి చేరుకున్న నీటి మట్టం
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
Godavari River Rises : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీలోని గోదావరి నదికి(Godavari River) వరద ఉధృతి పెరుగుతోంది. మరో వైపు భద్రాచలం వద్ద నీటి మట్టం 43.2 అడుగులకు చేరింది. ఇక పోలవరం వద్ద 11.6 మీటర్లకు నీటి మట్టం చేరడం విశేషం.
Godavari River Rises Huge
మరో వైపు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో కలిసి 7.80 లక్షల క్యూసెక్కులు ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింధి. వచ్చే బుధవారం వరకు స్వల్పంగా వరద పెరగనుందని పేర్కొంది.
ఇదిలా ఉండగా పోటెత్తుతున్న వరద ఉధృతి కారణంగా కాటన్ బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్స్ ఉందని తెలిపింది. విపత్తుల సంస్థ లోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది.
వరద ఉధృతి కారణంగా గోదావరీ నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సహాయక చర్యలు చేపట్టాలని.
Also Read : Tirumala Rush : శ్రీవారి కోసం పోటెత్తిన భక్తులు 70 వేళకి పైగా