Godavari Water : గోదావరి నీళ్లతో కళ కళ
హుస్నాబాద్ కు వాటర్
Godavari Water : ఒకప్పుడు కరవు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణలో ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడం లేదు. ఎక్కడ చూసినా నీళ్లతో దర్శనం ఇస్తున్నాయి. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేలా ప్రాజెక్టులు రూపొందించింది ప్రభుత్వం. ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని హుస్నాబాద్ ప్రాంతానికి పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి.
దీని వల్ల ఏకంగా లక్షా 20 వేల ఎకరాల వ్యవసాయ భూములకు నీరందుతోంది. పంటలు సమృద్దిగా పండుతున్నాయి. ఆనాడు గుక్కెడు నీటి కోసం నానా తంటాలు పడిన ప్రజలు, రైతులు. ప్రస్తుతం ఆశించిన దానికంటే ఎక్కువగా నీళ్లు లభిస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. అన్ని రకాల పంటలు పండించేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆదివారం ట్విట్టర్ వేదికగా ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్(KTR) గోదావరి జలాలు హుస్నాబాద్ ను తాకిన విషయాన్ని పంచుకున్నారు. ఇదంతా కేవలం బీఆర్ఎస్ చీఫ్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసిన కృషి వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు కేటీఆర్.
ఇదిలా ఉండగా గల గల పారుతున్న సెలయేర్లను తలపింప చేస్తున్న గోదావరి జలాలను చూసి తరిస్తున్నారు హుస్నాబాద్ వాసులు. తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. మరికొందరు జలకాటలలో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎమ్మెల్యే సతీష్ పట్టుదలకు అభినందనలు తెలిపారు మంత్రి కేటీఆర్.
Also Read : Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ పతనం ఖాయం