Godavari Water Flow : గోదావరి ఉగ్రరూపం అంతటా అప్రమత్తం
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, నదులు
Godavari Water Flow : బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. దీంతో భారీ ఎత్తున వర్షాలు ముంచెత్తుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో వర్షాల తాకిడి మరింత పెరిగింది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగింది. మరో వైపు కృష్ణా నది, గోదావరి నది ఉగ్ర రూపం దాల్చుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో అంతకంతకూ ఉధృతి పెరుగుతోంది.
Godavari Water Flow High
ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద నీటి తాకిడి పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 15.5 అడుగులకు నీటి మట్టం చేరింది. సముద్రంలోకి 15 లక్షల 63 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. నిన్నటి నుంచి అంతకంతకూ గోదావరి నీరు పెరుగుతోంది(Godavari Water Flow). రేపటి నుంచి వరద తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తోంది రాష్ట్ర వాతావరణ కేంద్రం.
గోదావరి దెబ్బకు కోనసీమ లోని లంక గ్రామాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఏపీ సీఎం వరద పరిస్థితి, సహాయక చర్యలపై ఆరా తీశారు. జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 55.1 అడుగులకు చేరుకుంంది.
ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 15.66 లక్షల క్యూసెక్కులు చేరింది. కాగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు.
Also Read : Megastar Chiranjeevi Cutout : భోళా శంకర్ భారీ కటౌట్ సూపర్