Donald Trump : అబార్షన్ హక్కుల రద్దు దేవుడి తీర్పు – ట్రంప్
హర్షం వ్యక్తం చేసిన మాజీ అధ్యక్షుడు
Donald Trump : అమెరికా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అబార్షన్ హక్కుల రద్దును స్వాగతించారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ డ్రంప్(Donald Trump). ఆయన ఈ తీర్పును దేవుడు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు.
ఇదిలా ఉండగా గత 50 ఏళ్ల కిందట మహిళలకు సంబంధించి చట్ట బద్దత కల్పించిన ఈ హక్కును రద్దు చేసింది. అబార్షన్ హక్కులను తోసి పుచ్చింది. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.
అంతే కాకుడా ఒక తరంలో జీవితానికి అతి పెద్ద విజయమని స్పష్టం చేశారు. తాను వాగ్ధనం చేసిన విధంగానే ఇది జరగడం తాను సాధించిన గెలుపుల్లో ఒకటిగా పేర్కొన్నారు ట్రంప్.
దాదాపు ఐదు దశాబ్దాలుగా ఈ చట్టం అమెరికాలో అమలు అవుతూ వచ్చింది. ఇది రాజ్యాంగాన్ని అనుసరిస్తోందని, చాలా కిందట ఇవ్వాల్సిన హక్కులను తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు.
6-3 మెజారిటీ సాధించడంతో అమెరికా లోని పలు రాష్ట్రాలలో దీనిపై స్వంతంగా నిర్ణయం తీసుకోనున్నాయని చెప్పారు ట్రంప్.
ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ దేశ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ కేసుకు సంబంధించి ముగ్గురు న్యాయమూర్తులను ఆయన నియమించారు.
ఈ సందర్భంగా ఈ తీర్పులో మీ పాత్ర ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. న్యాయమూర్తులు ఇవ్వలేదని వారి ద్వారా దేవుడు ఇచ్చాడంటూ సంచలన కామెంట్స్ చేశారు ట్రంప్(Donald Trump).
ఆయన హయాంలో ఏర్పాటైన నీల్ గోర్సుచ్ , బ్రెట్ కవనాగ్ , అమీ కోనీ బారెట్ న్యాయమూర్తులు మెజారిటీ నిర్ణయంపై సంతకం చేశారు.
Also Read : అబార్షన్ హక్కుల రద్దుపై ఆగ్రహం