Goldy Brar Arrest : సిద్దూ కేసులో సూత్ర‌ధారి గోల్డీ బ్రార్ అరెస్ట్

కాలిఫోర్నియాలో అదుపులో తీసుకున్న ఎన్ఐఏ

Goldy Brar Arrest : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన పంజాబ్ సింగర్ సిద్దూ మూసే వాలా కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ మేర‌కు హత్య కేసులో కీల‌క సూత్ర‌ధారిగా భావిస్తున్న గోల్డీ బ్రార్(Goldy Brar Arrest) ను కాలిఫోర్నియాలో అదుపులోకి తీసుకున్నారు. కెన‌డాకు చెందిన గ్యాంగ్ స్ట‌ర్ స‌తీంద‌ర్ జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ , లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ త‌ర‌పున సిద్దూ మూసే వాలా హ‌త్య‌కు బాధ్య‌త వ‌హించాడు.

మే నెల‌లో పంజాబీ గాయ‌కుడు సిద్దూ మూసే వాలాను దారుణంగా హ‌త్య చేశారు. ఈ హ‌త్య‌ను తామే చేశామంటూ ప్ర‌క‌టించారు కెన‌డాకు చెందిన గ్యాంగ్ స్ట‌ర్ స‌తీంద‌ర్ జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ ను అమెరికా లోని కాలిఫోర్నియాలో అదుపులోకి తీసుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా నిర్బంధం గురించి భార‌తీయ ఏజెన్సీలు ఇంకా నిర్ధార‌ణ‌కు రాలేద‌ని టాక్. భార‌త దేశంలోని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ త‌ర‌పున బ్రార్ ఈ హ‌త్య‌కు బాధ్య‌త వ‌హించాడు. పంజాబ్ లోని ముక్త్ స‌ర్ కు చెందిన బ్రార్ పై హ‌త్య‌, నేర‌పూరిత కుట్ర‌, అక్ర‌మ ఆయుధాల స‌ర‌ఫ‌రా , హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డినందుకు అత‌డిపై ఇంట‌ర్ పోల్ రెడ్ నోటీసు జారీ చేశారు.

బ్రార్ ఇటీవ‌ల కెన‌డా నుండి యుఎస్ కు వెళ్లార‌ని, న‌వంబ‌ర్ 20 న రాడార్ కు దూరంగా వెళ్లార‌ని పేరు చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌ని అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. బ్రార్ , అర్ష్ దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దాలా, ల‌ఖ్ బీర్ సింగ్ అలియాస్ లాండా, చ‌ర‌ణ్ జిత్ సింగ్ అలియాస్ బిహ్లా, రామ‌న్ దీప్ సింగ్ అలియాస్ రామ‌న్ జ‌డ్జి, గుర్బింద‌ర్ సింగ్ అలియాస్ బాబా డ‌ల్లా , సుఖ్బుల్ సింగ్ అలియాస్ సుఖ దునేకేతో స‌హా కెన‌డా లో ఉన్న పంజాబ్ గ్యాంగ్ స్ట‌ర్ల‌ను భార‌త ఏజెన్సీలు ట్రాక్ చేస్తున్నాయి.

Also Read : ప్ర‌జాస్వామ్యం భార‌త‌దేశానికి మూలం

Leave A Reply

Your Email Id will not be published!