Gone Prakash Rao : రేవంత్ నిర్వాకం కాంగ్రెస్ ఖతం
గోనె ప్రకాశ్ రావు సంచలన కామెంట్స్
Gone Prakash Rao : హైదరాబాద్ – టీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శాపంగా మారాడని ఆరోపించారు. పనిగట్టుకుని నాశనం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు.
Gone Prakash Rao Slams Revanth Reddy
వైఎస్ షర్మిలను పార్టీ లోకి రాకుండా అడ్డుకుంటున్నాడని, ఈయన ఒంటెత్తు పోకడ వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతోందన్నారు. సమైక్య మద్దతుదారులు రావొద్దు అనుకుంటే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎందుకు పార్టీలోకి తీసుకున్నావంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
డబ్బులు ఇచ్చిన వాళ్లను పార్టీలో చేర్చుకుంటున్నారని ఇది పూర్తిగా పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్నారు గోనె ప్రకాశ్ రావు(Gone Prakash Rao). తుమ్మల నాగేశ్వర్ రావును ఎందుకు పార్టీలోకి రావాలని కోరుతున్నావో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
సమైక్య వాదానికి మద్దతు తెలిపిన సీపీఎంతో ఎందుకు పొత్తు పెట్టుకునేందుకు తహ తహ లాడుతున్నావో చెప్పాలన్నారు గోనె ప్రకాశ్ రావు. మొత్తంగా రేవంత్ రెడ్డి నిర్వాకం కారణంగా ఇవాళ ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తానే అడ్డంకిగా , అడ్డుగోడగా మారాడని ఆరోపించారు . ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : RS Praveen Kumar : వాడుకుని వదిలేసే పార్టీలవి