#Facebook : ఫేస్‌బుక్ ఉద్యోగులు ఫుల్ ఎంజాయ్
ఆడుతూ పాడుతూ పని చేసే అవకాశం
Facebook : కరోనా పుణ్యమా అంటూ ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న వారికి ఇప్పుడు ఇంటి వద్ద నుంచే పని చేసుకునే సదుపాయం కలుగుతోంది. దీంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్న రీతిలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు అన్ని దేశాలు విలవిలలాడుతున్నాయి. ఇదే సమయంలో తాము ప్రయాణం చేస్తూ ఆఫీసులకు రాలేమంటూ ఉద్యోగులు తెగేసి చెప్పడంతో కంపెనీలు కాళ్ల బేరానికి వచ్చాయి. దీంతో ఆఫీసులకు మాత్రం రాకపోయినా పర్వాలేదు కానీ టైం తప్పకుండా నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తి చేసేందుకు కావాల్సిన సదుపాయాలను తాము సమకూరుస్తామంటూ కంపెనీల యజమానులు స్పష్టం చేశారు.
దీంతో సందిట్లో సడేమియా అన్న చందంగా ఫుల్ జోష్ మీదున్నారు. ఎక్కువగా అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్, లండన్ , తదితర దేశాల్లో ఎక్కువగా ఉంటున్న అన్ని రంగాల కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఉద్యోగులు సైతం వర్క్‌లో నిమగ్నమవుతున్నారు. తాజాగా ఐటీ దిగ్గజ కంపెనీ ఫేస్ బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే కరోనా ప్రభావం ఉన్నందున ఉద్యోగులకు అదనపు బోనస్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 6 నెలల వేతనాన్ని బోనస్ గా ప్రకటించింది. ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ డిసిషన్ తీసుకున్నట్లు తెలిపింది.
ఇంటి నుంచే పనిచేసే సిబ్బంది ఖర్చులను దృష్టిలో ఉంచుకుని 1,000 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మొత్తం 45,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జకర్‌బర్గ్ వెల్లడించారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ సదుపాయం ఉండదని స్పష్టం చేశారు. వారి ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన పక్షంలో విధులకు హాజరు కాకపోయినా.. పూర్తి వేతనం లభిస్తుంది. ఫేస్‌బుక్ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం 2,28,651 డాలర్లుగా ఉంది.
మీ కుటుంబాల గురించి మరింతగా జాగ్రత్తలు తీసుకునేందుకు మీకు సమయం అవసరమన్న సంగతి సంస్థకు తెలుసు.
వర్క్ ఫ్రం హోమ్ ప్రక్రియకు నివాసంలో ఏర్పాట్లు చేసుకోవడానికి అదనపు ఖర్చులు ఉంటాయి. అందుకే, ఉద్యోగులందరూ అదనంగా 1,000 డాలర్లు పొందవచ్చు అని అధికారిక మెమోలో జకర్‌బర్గ్ తెలిపారు. అమెరికాలోని సియాటిల్‌లో ఫేస్‌బుక్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఓ కాంట్రాక్టర్‌కు కోవిడ్–19 బారిన పడటంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మిగతా ఆఫీసులను తర్వాత మూసివేయడంతో చాలా మటుకు ఉద్యోగులు వారం రోజుల నుంచి.. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ ఉన్న ప్రాంతాల్లోనే ఇది వర్తిస్తుందన్న విషయం గమనించాలి.
No comment allowed please