I Phone 5G : ఐ ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్
డిసెంబర్ నుంచి 5జీ సపోర్ట్
I Phone 5G : భారత దేశంలో యాపిల్ ఫోన్లను వాడుతున్న ఐ ఫోన్ లవర్స్ కు ఖుష్ కబర్ చెప్పింది. ఇప్పటికే పలు నగరాల్లో టెలికాం కంపెనీలు 5జీ సర్వీసులు అందజేస్తున్నాయి. వాటిలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ తో పాటు వొడాఫోన్ , ఐడియా ఉన్నాయి. ఈ తరుణంలో చాలా మంది వినియోగదారులు 4జీ కనెక్టివిటీ కలిగిన ఫోన్లనే వాడుతున్నారు.
ఇంకా అప్ డేట్ కాలేదు. దీంతో ఐఫోన్ వాడుతున్న వారు డైలమాలో పడి పోయారు. తమ డివైజ్ లు సపోర్ట్ చేస్తాయో లేదోనన్న అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి యాపిల్ కీలక ప్రకటన చేసింది. ప్రధానంగా భారతీయ వినియోగదారుల కోసం. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఐఫోన్ 14, 13, 12 , ఐఫోన్ ఎస్ఈతో సహా ఇటీవలి మోడళ్లకు సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పుష్ చేస్తామని తెలిపింది యాపిల్.
ప్రస్తుతం నెట్ వర్క్ కు మద్దతు ఇవ్వడం లేదంటూ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో గందరగోళానికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది ఆపిల్. వచ్చే డిసెంబర్ నాటికల్లా భారత దేశంలో 5జీ సేవలను(I Phone 5G) విడుదల చేస్తామని తెలిపింది. భారత దేశంలో తన ఐఫోన్ మోడళ్లను 5జీ నెట్ వర్క్ లకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొంది.
భారతీయ అధికారులు హై స్పీడ్ నెట్ వర్క్ ను స్వీకరించమని మొబైల్ ఫోన్ తయారీదారులను కోరడంతో ఆయా కంపెనీలు సాఫ్ట్ వేర్ ను అప్ గ్రేడ్ చేసే పనిలో పడ్డాయి.
Also Read : భారత్ లో యాపిల్ ఎయిర్‌పాడ్‌ల తయారీ