TTD : తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు దిగి వచ్చింది. దర్శనానికి సంబంధించి సేవా టికెట్ల ధరలను భారీగా పెంచాలని ఇటీవల జరిగిన టీటీడీ(TTD) పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఆ విషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు కూడా. ఇదే విషయం సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది. ఇప్పటికే కోటి కష్టాలు పడుతూ ఆ దేవ దేవుడిని దర్శించు కునేందుకు వచ్చే భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
అంతే కాకుండా ప్రస్తుతం జంబో టీమ్ గా తయారైంది టీటీడీ(TTD). వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. వైవీఎస్ తాను మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
ప్రపంచ వ్యాప్తంగా టీటీడీ అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచడం లేదని ధర్మకర్తల మండలి చైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
టీటీడీ పాలక మండలి సమావేశం ప్రత్యక్షం కావడం అది హాట్ టాపిక్ గా మారడంతో తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు ఇస్తున్న తొందరపాటు సూచనలు గుడ్డిగా నమ్మవద్దని భక్తులు కోరుతున్నారు.
ధర్మకర్తల మండలి తీసుకునే నిర్ణయం మెచ్చే విధంగా ఉండాలని సూచించారు. వెంగమాంబ అన్నదాన సముదాయంతో పాటు మరికొన్ని ఉచిత అన్నదాన సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అభినందనీయం.
తిరుమలలో వీఐపీల తాకిడికి సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read : త్వరితగతిన సామాన్య భక్తులకు సర్వదర్శనం మా లక్ష్యం