TSCHE : ఎంసెట్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి శుభవార్త చెప్పింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి(TSCHE). గతంలో 40 మార్కులు ఉంటేనే పరీక్షకు అర్హులుగా పరిగణించే వారు.
కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడి పోయింది. ఒకటో తరగతి నుంచి పీజీ స్థాయి దాకా ఎక్కడా పూర్తి స్థాయిలో సిలబస్ పూర్తి కాలేదు.
ఈ ప్రభావం ఇంటర్ చదివే విద్యార్థులపై పడింది. పదో తరగతితో పాటు ఇంటర్ కూడా అత్యంత కీలకం విద్యార్థులకు. ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చేయాలంటే తప్పనిసరిగా తెలంగాణ విద్యార్థులు విధిగా ఎంసెట్ (TSCHE)రాయాల్సిందే.
విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఉన్నత విద్యా మండలి కనీసంగా నిర్ణయించిన 40 మార్కులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక కనీస మార్కులు వస్తే చాలని స్పష్టం చేసింది.
ఈ వెసలుబాటు వల్ల ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. కరోనా ఎఫెక్టుతో గత ఏడాది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల్ని ప్రభుత్వం ప్రమోట్ చేసింది.
గత ఏడాది అక్టోబర్ లో పరీక్షలు పెట్టారు.ఇదిలా ఉండగా కేవలం 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాస్ అయ్యారు. ఆన్ లైన్ లో పాఠాలు సరిగా చెప్పక పోవడం వల్ల తాము ఎగ్జామ్స్ సరిగా రాయలేక పోయామంటూ విద్యార్థులు వాపోయారు.
ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్ పేరెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కొంతమంది పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మొత్తంగా ఈ నిర్ణయం ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ అని చెప్పక తప్పదు.
Also Read : భర్త యుద్దం భార్య సహకారం