Tirumala Updates : శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త
పాలక మండలి కీలక నిర్ణయాలు
Tirumala Updates : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇవాల్టి నుంచి దర్శనానికి సంబంధించి మార్పు చేసినట్ల వెల్లడించారు. బ్రేక్ దర్శనం సమయంలో మార్పు ఉంటుందన్నారు.
ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేపడతామన్నారు. అంతే కాకుండా వచ్చే ఏడాది 2023 ఫిబ్రవరి 23న బాలాలయ పనులు ప్రారంభిస్తామని చెప్పారు టీటీడీ చైర్మన్(Tirumala Updates). కాగా ఈ తాపడం చేసే సమయంలో భక్తుల దర్శనానికి ఎలాంటి మార్పు చేయబోమన్నారు.
ప్రతి ఒక్కరికీ స్వామి వారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు వైవీ సుబ్బారెడ్డి. తమ ప్రాధాన్యత సామాన్య భక్తులకు దర్శనం కల్పించడమని స్పష్టం చేశారు. వచ్చే జనవరి 2 నుంచి 11వ తేదీ దాకా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఇంకో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గురువారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల నుంచి 8 గంటల మధ్య కొనసాగుతుందన్నారు వైవీ సుబ్బారెడ్డి. నందకం గెస్ట్ హౌస్ లో 2.95 కోట్లతో అధునాతనమైన ఫర్నీచర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జమ్మూలో ఆలయాల నిర్మాణానికి రూ. 7 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచే విషయంపై ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తిరుపతి లోని అమ్మ వారి ఆలయ అభివృద్ది కోసం రూ. 3.7 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, దివ్యాంగులకు సంబంధించి ఉచితంగా దర్శన ప్రవేశం కొనసాగుతోందన్నారు.
Also Read : దేశం బాగుండాలని పూజిస్తున్నా – రాహుల్