Google CEO : ఎక్క‌డికి వెళ్లినా ఇండియా నాతోనే ఉంటుంది

గూగుల్ సిఇఓ పిచాయ్ సంచ‌ల‌న కామెంట్స్

Google CEO : తాను ఎక్క‌డికి వెళ్లినా ఇండియాను నాతో పాటు తీసుకు వెళతాన‌ని అన్నారు గూగుల్ సిఇఓ సుంద‌ర్ పిచాయ్. ట్రేడ్ అండ్ ఇండ‌స్ట్రీ విభాగంలో 2022కి గాను ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారం ల‌భించంది. త‌మిళ‌నాడు లోని మ‌ధురై లో జ‌న్మించారు సుంద‌ర్ పిచాయ్. ఈ ఏడాది 2022కి గాను కేంద్ర ప్ర‌భుత్వం 17 అవార్డుల‌ను ప్ర‌క‌టించింది.

వారిలో మైక్రోసాఫ్ట్ సిఇఓ స‌త్య నాదెళ్ల‌తో పాటు గూగుల్ సిఇఓ సుంద‌ర్ పిచాయ్ ని ఎంపిక చేసింది. అమెరికా లోని భార‌త రాయ‌బారి నుంచి ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు అందుకున్నారు సుంద‌ర్ పిచాయ్. ఈ సంద‌ర్బంగా గూగుల్ సిఇఓ(Google CEO) ప్ర‌సంగించారు. భార‌త దేశం నాలో ఒక భాగం. తాను ఎక్క‌డికి వెళ్లినా దానిని నా వెంట తీసుకు వెళతాన‌ని చెప్పారు.

శాన్ ఫ్రాన్సిస్కోలో త‌న స‌న్నిహిత కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో అత్యున్న‌త‌మైన పుర‌స్కారాన్ని, అంత‌కు మించి గౌర‌వాన్ని అందుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు సుంద‌ర్ పిచాయ్. ఇది త‌న‌కు ల‌భించిన గౌర‌వం కంటే కోట్లాది మంది భార‌తీయుల‌కు ల‌భించిన పుర‌స్కారంగా తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు.

ఈ అపార‌మైన గౌర‌వాన్ని త‌న‌కు క‌లిగించినందుకు ఈ సంద‌ర్భంగా దేశ ప్ర‌ధాన మంత్రి మోదీకి, భార‌త దేశానికి, 137 కోట్ల భార‌తీయులంద‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ చేసుకుంటున్నాన‌ని చెప్పారు గూగుల్ సిఇఓ(Google CEO). న‌న్ను తీర్చిదిద్దిన భార‌త దేశం ఈ విధంగా గౌర‌వించ‌డం ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని తెలిపారు. ఆయ‌న‌కు 50 ఏళ్లు ఇప్పుడు.

నా ఆస‌క్తుల‌ను అన్వేషించ‌డానికి నాకు అవ‌కాశాలు ఉండేలా చూసుకునేందుకు చాలా త్యాగం చేసిన పేరెంట్స్ , నేర్చుకోవ‌డం, జ్ఞానాన్ని ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కుటుంబంలో ఎద‌గ‌డం నా అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో భార‌త కాన్సుల్ జ‌న‌ర‌ల్ టివి నాగేంద్ర ప్ర‌సాద్ పాల్గొన్నారు.

Also Read : సౌరాష్ట్ర విజ‌య్ హ‌జారే ఛాంపియ‌న్

Leave A Reply

Your Email Id will not be published!