Google CEO : ఉద్యోగుల నిర్వాకం సిఇఓ ఆగ్రహం
క్యూ2 వార్షిక ఫలితాల్లో గూగుల్ కు షాక్
Google CEO : ప్రపంచాన్ని టెక్నాలజీ పరంగా తన గుప్పిట్లోకి తెచ్చుకున్న టెక్ దిగ్గజం గూగుల్ ఒడిదుడుకులకు లోనవుతోందా. ఉద్యోగుల పనితీరు పట్ల ఆ సంస్థ సిఇఓ సుందర్ పిచాయ్(Google CEO) అసంతృప్తితో ఉన్నారా. అవుననే అనిపిస్తోంది.
రోజు రోజుకు ఇన్నోవేషన్స్ లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే సంస్థల్లో గూగుల్ వరల్డ్ లో ముందుంటోంది.
కానీ మిగతా టెక్ దిగ్గజాలతో పోటీ ఎదుర్కొంటోంది గూగుల్. ప్రధానంగా ఏపీకి చెందిన సత్య నాదెళ్ల సిఇఓగా ఉన్న మైక్రోసాఫ్ట్ దూసుకు పోతోంది.
ఇక తాజాగా క్యూ2 వార్షిక ఫలితాల్లో గూగుల్ సిఇఓ ఆశించిన మేరకు ఫలితాలు రాలేక పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రపంచంలో ఏ కంపెనీలో లేని విధంగా గూగుల్ టెక్ సంస్థ ఉద్యోగులను స్వంత కుటుంబీకుల కంటే ఎక్కువగా చూసుకుంటుంది.
కాగా గూగుల్ లో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులలో కేవలం కొద్ది మంది మాత్రమే పని చేస్తున్నారని మిగతా వారంతా ఎంజాయ్ చేస్తున్నట్లు గుర్తించారు సుందర్ పిచాయ్.
ముందే పసిగట్టిన సదరు సిఇఓ పనితీరు మార్చుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విచిత్రం ఏమిటంటే ఈసారి ఫలితాల్లో గూగుల్ కు చేదు అనుభవం ఎదురైంది.
ఆదాయాలు, రాబడుల పరంగా చూస్తే అంచనాల కంటే తక్కువగా ఉండడం ఒకింత ఆందోళనకు గురి చేసింది సిఇఓను. ఈ ఏడాది త్రైమాసికంలో గూగుల్ కేవలం 13 శాతం తక్కువ వృద్ధిని నమోదు చేయడం విస్తు పోయేలా చేసింది.
Also Read : ద్రవ్యోల్బణం ముప్పు వడ్డీ రేట్ల పెంపు