Google CEO : భారత రాయబారితో సుందర్ పిచాయ్ భేటీ
రాయబార కార్యాలయాన్ని సందర్శించిన సిఇఓ
Google CEO : ప్రపంచ నెంబర్ వన్ టెక్ సెర్చింగ్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) సుందర్ పిచాయ్(Google CEO) వార్తల్లో నిలిచారు. ఆయన మొదటిసారిగా అమెరికాలోని వాషింగ్టన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించారు.
సిఇఓకు రాయబారి సాదర స్వాగతం పలికారు. సుందర్ పిచాయ్ , రాయబారి కలిసి చాలా సేపు చర్చించారు. భారత దేశం పట్ల గూగుల్ నిబద్దత గురించి చర్చించే అవకాశాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు సిఇఓ.
భవిష్యత్తులో డిజిటల్ భవిష్యత్తు కోసం తమ సపోర్ట్ కొనసాగుతుందని పేర్కొన్నారు సుందర్ పిచాయ్. ఇదిలా ఉండగా గూగుల్ సిఇఓ ఆధ్వర్యంలో భారత దేశంలో భారీ పెట్టుబడులు పెట్టిందని చెప్పారు.
ప్రధానంగ దేశంలోని టెక్ కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించామన్నారు. ముఖ్యంగా డిజటలైజేషన్ వైపు దూకుడుగా దూసుకు పోతున్న వివిధ అంశాలపై గూగుల్ సిఇఓ ఫోకస్ పెట్టడం అభినందనీయమని ప్రశంసించారు భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు.
గొప్ప సంభాషణకు ధన్యవాదాలు తెలిపారు సుందర్ పిచాయ్(Google CEO) తన అధికారిక ట్విట్టర్ లో. విచిత్రం ఏమిటంటే గూగుల్ కంపెనీకి సంబంధించి సిఇఓ రాయబార కార్యాలయాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఇప్పటికే రిలయన్స్ కంపెనీతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరిలో కేంద్ర సర్కార్ ప్రకటించిన అత్యున్నత పురస్కారాలలో పేరొందిన పద్మభూషణ్ అందుకున్న 17 మంది అవార్డు గ్రహీతలలో సుందర్ పిచాయ్ ఒకరుగా ఉన్నారు.
ఇక సుందర్ పిచయ్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రం. ఐఐటీలో చదువుకున్నారు. ఆండ్రాయిడ్ సృష్టికర్తగా పేరొందారు.
Also Read : టాటాలను దాటేసిన అదానీ గ్రూప్