Google Alert : గూగుల్ క్రోమ్ యూజర్లు జర జాగ్రత్త
బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోండి
Google Alert : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నిత్యం టెక్ దిగ్గజంగా పేరొందిన గూగుల్ ను ఉపయోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వస్తోంది. ఇటీవల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యూజర్లు. బగ్ లను గుర్తించడం, ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దే పనిలో పడింది గూగుల్ సంస్థ. దీంతో ఇక నుంచి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది గూగుల్(Google Alert).
వెంటనే గూగుల్ క్రోమ్ యూజర్లు చెక్ చేసుకోవాలని, అప్ డేట్ కాక పోతే వెంటనే అప్ డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. లేక పోతే చిక్కుల్లో పడతారని హెచ్చరించింది. ఈ మేరకు హై సెక్యూరిటీ వార్నింగ్ ఇచ్చింది గూగుల్. వరల్డ్ వైడ్ గా ఎన్నో వెబ్ బ్రౌజర్లు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి. యూజర్లకు బగ్ చోటు చేసుకుందని సీవీఈ-2022-3723 అనే కోడ్ ద్వారా డేటా ముప్పు పొంచి ఉందంటూ గూగుల్ హెచ్చరించింది.
ఈ కోడ్ సెర్చింగ్ సమయంలో సమాచారం రాకుండా అడ్డుకుంటుందని వెల్లడించింది. ఈ ఎర్రర్ ను వెంటనే గుర్తించామని దాని సరిదిద్దామని అందుకే యూజర్లు జర జాగ్రత్తగా ఉండాలని సూచించింది గూగుల్. ఒక వేళ అప్ డేట్ చేసుకోక పోతే వెంటనే విండోస్ కోసం అప్ డేట్ చేసింది. హానికరమైన బగ్ నుంచి తమ ల్యాప్ టాప్ లు లేదా కంప్యూటర్లు సురక్షితంగా ఉండేందుకు లేటెస్ట్ వెర్షన్ ను విడుదల చేసింది గూగుల్.
ఎలా అప్ డేట్ చేసుకోవాలంటే ముందుగా గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేయాలి. స్క్రీన్ ఎగువ పక్కన ఉన్న మూడు చుక్కలు ఉంటాయి. వాటిపై క్లిక్ చేయాలి. మెనూ లిస్ట్ లో హెల్ప్ పై ఉంచాలి. అప్ డేట్ అని కనిపిస్తుంది. ఒకవేళ ఇందులో అప్ డేట్ బటన్ కనిపించక పోతే లేటెస్ట్ వెర్షన్ లో ఉన్నారని అర్థం చేసుకోవాలి యూజర్లు.
Also Read : వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్