Google Doodle Winner : గూగుల్ డూడ‌ల్ విన్న‌ర్ శ్లోక్ ముఖ‌ర్జీ

ప్ర‌క‌టించిన ఐటీ దిగ్గ‌జ సంస్థ

Google Doodle Winner : ప్ర‌పంచ వ్యాప్తంగా మోస్ట్ పాపుల‌ర్ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్. రోజు రోజుకు కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు, ప్ర‌యోగాలు చేస్తూ దూసుకు పోతోంది. దానికి ధీటుగా ఎన్నో ప్ర‌యోగాలు చేసినా, కొత్త‌వి వ‌చ్చినా గూగుల్ ను దాట‌లేక పోతున్నాయి. ఇప్ప‌టికీ వ‌ర‌ల్డ్ వైడ్ గా గూగుల్ లేకుండా ప్రపంచాన్ని చూడ‌లేం, తెలుసుకోలేమ‌న్న ప‌రిస్థితికి వ‌చ్చేసింది.

ప్ర‌తి రోజూ గూగుల్ బ్రౌజ‌ర్ లేకుండా లోకం మ‌న‌లేని స్థితికి చేరుకుంది. ఈ త‌రుణంలో గూగుల్ ప్ర‌తి రోజూ ఏదో ఒక అంశానికి సంబంధించి లేదా ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసిన ఆవిష్క‌ర‌ణ‌లు, ప్ర‌భావిత వ్య‌క్తులు, త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి డూడుల్(Google Doodle) తో అల‌రిస్తుంది. ప్ర‌తి ఏటా డూడుల్స్ పోటీ నిర్వహిస్తుంది.

ఎంపికైన వారికి భారీ ఎత్తున ప్రైజ్ మ‌నీ కూడా ఇస్తుంది గూగుల్. ఇక గూగుల్ ను వాడే ప్ర‌తి ఒక్క‌రికీ డూడుల్ అన్న‌ది సుప‌రిచిత‌మే. చిన్నారుల నుండి వృద్దుల దాకా ప్రతి ఒక్క‌రు డూడుల్ ను ఎంజాయ్ చేస్తారు. అందుకే దానికంత‌టి ప్రాధాన్య‌త‌. తాజాగా ఎక్కువ మందిని ప్ర‌భావితం చేయ‌డం, ఆలోచ‌న‌లు రేకెత్తించ‌డం, కొత్త విష‌యాన్ని నేర్చుకునేలా డూడుల్ ను తీర్చిదిద్దే వారికి ప‌ట్టం క‌డుతుంది.

ఇదిలా ఉండ‌గా బాల‌ల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని గూగుల్ ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్ క‌తాకు చెందిన శ్లోక్ ముఖ‌ర్జీ అనే విద్యార్థి త‌యారు చేసిన డూడుల్ ని(Google Doodle Winner) ఎంపిక చేసింది. ఈ మేర‌కు అత్యుత్త‌మ డూడుల్ గా ప్ర‌క‌టించింది గూగుల్. దీనికి ఇండియా ఆన్ ది సెంట‌ర్ స్టేజ్ అనే పేరుతో డూడుల్ త‌యారు చేసింది.

ఈ పోటీకి దేశంలోని 100 న‌గ‌రాల నుంచి 10 నుంచి 10 త‌ర‌గ‌తి చ‌దివే పిల్ల‌లు 1,15,000 ఎంట్రీలు పంపార‌ని వెల్ల‌డించింది గూగుల్.

Also Read : సింగ‌పూర్ పై ఫేస్ బుక్ లే ఆఫ్స్ ఎఫెక్ట్

Leave A Reply

Your Email Id will not be published!