Google : సున్నితమైన ప్రకటనల విషయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని నిర్ణయించింది ఆల్ఫాబెట్ గూగుల్(Google ). ప్రపంచ వ్యాప్తంగా టాప్ లో ఉన్న ఈ దిగ్గజ సెర్చింగ్ సంస్థ రోజు రోజుకు భద్రత, గోప్యత పాటించే విషయంపై మల్లగుల్లాలు పడుతోంది.
ఏదైనా చూడరానిది లేదా అభ్యంతరకరమైన యాడ్స్ లేదా ప్రకటనలు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే అలాంటి ప్రకటను కనిపించనీయకుండా ఉండేందుకు కొత్త టెక్నాలజీని తీసుకు వస్తోంది.
ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రధానంగా అత్యధిక ఆదాయం ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రకటనల ద్వారా గూగుల్ కు సమకూరుతోంది.
ఈ తరుణంలో చాలా దేశాలు అనవసరంగా వచ్చే యాడ్స్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలు, ముఖ్యంగా 18 ఏళ్ల లోపు వారిపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పటికే నియంత్రించ లేని రీతిలో బూతు రాజ్యం ఏళుతోంది. ప్రతి రోజూ కోట్లాదిగా పోర్న్ రాజ్యం ఏళుతోంది. దానికి ఉన్నంత మార్కెట్ ఇంకే దానికి లేదంటే నమ్మలేం. వీటిని కంట్రోల్ చేసేందుకు ఆయా దేశాలు స్వీయ నియంత్రణను పాటిస్తున్నాయి.
పనిలో పనిగా చట్టాలు కూడా తయారు చేస్తున్నాయి. ఆ మేరకు ఆయా దేశాలు ఇప్పటికే గూగుల్ కు విన్నవించాయి కూడా. కోట్లాది వెబ్ సైట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక యూట్యూబ్ లో అభ్యంతరకర వీడియోల గురించి చెప్పాల్సిన పని లేదు.
దీంతో గూగుల్ మరింత దృష్టి పెట్టినట్లు సమాచారం. సెక్స్ సంబంధిత వస్తువులు, మద్యం, తదితర సున్నితమైన వాటికి సంబంధించిన యాడ్స్ రాకుండా ఉండేలా చూస్తోంది గూగుల్(Google ). ఈ మేరకు తన సెట్టింగ్స్ లను సవరించడం స్టార్ట్ చేసింది.
Also Read : బిల్ గేట్స్ లైంగిక వేధింపులపై సమీక్ష