Google : వ్యూహాలు Google పన్నడంలోనే కాదు వ్యాపార పరంగా తనతో సాటి రారు ఎవరూ అంటోంది ప్రముఖ సెర్చింగ్ టెక్ దిగ్గజం గూగుల్. ప్రపంచంలోని ప్రధాన కంపెనీలన్నీ ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి.
ఆసియా ప్రాంతంలో ఎక్కువగా మార్కెట్ కలిగి ఉన్నది ఏదైనా ఉందంటే అది భారత్. ఇప్పటికే టెలికాం రంగంలో అత్యధిక వాటా కలిగిన రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకుంది గూగుల్(Google ).
మరో వైపు సెకండ్ ప్లేస్ లో ఉన్న భారతీ మిట్టల్ కు చెందిన ఎయిర్ టెల్ పై కూడా కన్నేసింది టెక్ సంస్థ. దీంతో రెండు కంపెనీలలో భాగస్వామ్యం లేదా పెట్టుబడులు పెట్టడం ద్వారా రెండింటికి ఉన్న కస్టమర్లను యాడ్ చేసుకోవచ్చనేది వ్యూహం.
పలు రంగాలలో తనదైన వ్యాపార ముద్ర వేసుకుంటూ పోతున్న రిలయన్స్ సంస్థ చీఫ్ అంబానీ కంపెనీలో ఇప్పటికే భారీగా ఇన్వెస్ట్ చేసింది గూగుల్(Google ). తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
ఎయిర్ టెల్ తో కూడా జత కట్టినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎయిర్ టెల్ కూడా ధ్రువీకరించింది. రిలయన్స్ నుంచి గట్టి పోటీని తట్టుకుని నిలబడింది.
ఒకానొక దశలో పూర్తిగా తప్పుకోవాలని అనుకున్నట్లు ఓ సందర్భంలో చెప్పారు భారతీ ఎయిర్ టెల్. కాగా గూగుల్ భారతీ ఎయిర్ టెల్ లో 100 కోట్ల డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయనుంది.
అంటే భారతీయ రూపాయల్లో రూ. 7 వేల 500 కోట్లు అన్నమాట. 5జీ సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని భావిస్తోంది ఎయిర్ టెల్. దీని వల్ల జియోకు గట్టి పోటీ ఇవ్వనుంది..
Also Read : కాసులు కురిపిస్తున్న పాత ఫోన్లు