Google Lay Offs : ఉద్యోగాల కోతకు గూగుల్ రెడీ
ట్విట్టర్..ఫేస్ బుక్..అమెజాన్
Google Lay Offs : ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పేరుతో దిగ్గజ కంపెనీలు ఉద్యోగాలకు చెక్ పెడుతున్నాయి. ఎప్పుడైతే టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకోవడం మొదలు పెట్టాడో ఆనాటి నుంచి ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయి. వస్తూనే టాప్ ఎగ్జిక్యూటివ్ లను సాగనంపాడు.
ఆపై 3,978 మంది ఎంప్లాయిస్ ను తీసి వేశాడు. ఆపై కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న 5,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో మస్క్ శ్రీకారం చుడితే ఆ వెంటనే మిగతా దిగ్గజ కంపెనీలు తామేమీ తక్కువ కాదంటూ ఉద్యోగులను తీసి వేసే పనిలో పడ్డాయి. మెటా – ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ ఏకంగా 11,000 మందిని తొలగించాడు.
ఆపై మరో అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. 10,000 వేల మందికి చెక్ పెట్టనుంది. ఇదే సమయంలో వరల్డ్ వైడ్ గా టాప్ లో కొనసాగుతున్న టెక్ దిగ్గజ కంపెనీ ఆల్ఫా బెట్ – గూగుల్(Google Lay Offs) సిఇఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులను సాగనంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
$6 బిలియన్ల వాటాతో 2017 నుండి ఆల్ఫాబెట్ లో పెట్టుబడిదారుగా ఉన్న ఫండ్ కంపెనీ. ఇందులో చాలా మందిని కలిగి ఉంది. కాస్ట్ కటింగ్ లో భాగంగా తొలగించేందుకు శ్రీకారం చుట్టిందని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ప్రకటనకర్తల నుంచి స్పందన రావడం లేదంటూ అందుకే భారం తొలగించాలని అనుకుంటున్నట్లు అమెరికా మీడియా కోడై కూస్తోంది.
Also Read : నిన్న ట్విట్టర్..మెటా..నేడు అమెజాన్