Google Stop : విండోస్ యూజ‌ర్ల‌కు గూగుల్ బిగ్ షాక్

వ‌చ్చే ఏడాది నుంచి 7, 8.1 తొల‌గింపు

Google Stop : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కోలుకోలేని షాక్ ఇచ్చింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా విండోస్ ను ఎక్కువ‌గా వాడుతున్నారు యూజ‌ర్లు. తాజాగా వ‌చ్చే ఏడాది 2023లో విండోస్ 7, 8.1కి మ‌ద్ద‌తును నిలిపి వేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఒక ర‌కంగా యూజ‌ర్ల‌కు ఇబ్బందిక‌రంగా మార‌నుంది.

కొత్త క్రోమ్ వెర్ష‌న్ తో వ‌చ్చే ఏడాది ప్రారంభంలో విండోస్ 7, విండోస్ 8.1కి మ‌ద్ద‌తును నిలిపి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది గూగుల్ సంస్థ‌(Google Stop). ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా గూగుల్ క్రోమ్ కు సంబంధించి కొత్త వెర్ష‌న్ ను త‌యారు చేసే ప‌నిలో ప‌డింది. ఇప్ప‌టికే ప‌లు బ్రౌజ‌ర్లు వ‌ర‌ల్డ్ వైడ్ గా టెక్నాల‌జీ ప‌రంగా ప‌ని చేస్తున్నా ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క్రోమ్ ను ఉప‌యోగిస్తున్నారు.

విండోస్ ను ఆస‌రాగా చేసుకుని ఇది వ‌ర్క‌వుట్ అవుతుంది. 2023 ఫిబ్ర‌వ‌రి 7న క్రోమ్ 110 పేరుతో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ క్రోమ్ విండోస్ 7, విండోస్ 8.1కి అధికారికంగా మ‌ద్ద‌తును నిలిపి వేస్తున్న‌ట్లు గూగుల్ కంపెనీ స్ప‌ష్టం చేసింది. అయితే విండోస్ కు సంబంధించి కొత్త‌గా విడుద‌ల చేసే గూగుల్ క్రోమ్ వెర్ష‌న్ విండోస్ 10 మాత్ర‌మే స‌పోర్ట్ చేస్తుంది.

ఈ విష‌యాన్ని యూజ‌ర్లు గుర్తించాల‌ని వెల్ల‌డించింది. కాగా ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ల వినియోగ‌దారుల కోసం కొత్త అప్ డేట్ లు ఏవీ ఉండ‌వ‌ని పేర్కొంది. ఇక నుంచి సెక్యూరిటీ అప్ డేట్ లు , కొత్త ఫీచ‌ర్లు పొందాల‌నుకుంటే విండోస్ మ‌ద్ద‌తు ఉన్న వెర్ష‌న్ కి అప్ గ్రేడ్ చేయాల‌ని సూచించింది గూగుల్.

Also Read : చ‌ర్చిల్ కామెంట్స్ త‌ప్పని తేలింది

Leave A Reply

Your Email Id will not be published!