Gotabaya Rajapaksa : ద్వీప దేశంలో కాలు మోపిన రాజపక్సే
పారిపోయి తిరిగి వచ్చిన మాజీ ప్రెసిడెంట్
Gotabaya Rajapaksa : శ్రీలంకలో చోటు చేసుకున్న రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి కారకుడై ప్రజల ఆగ్రహంతో దేశం విడిచి పారి పోయిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే(Gotabaya Rajapaksa) తిరిగి తన దేశంలో కాలు మోపారు.
దీంతో విస్తు పోవడం జనం వంతైంది. రాజపక్సే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. గోటబయకు మంత్రులు, రాజకీయ నాయకులు స్వాగతం పలికారు.
ఈ 73 ఏళ్ల నాయకుడు బ్యాంకాక్ నుండి సింగపూర్ మీదుగా తిరిగి వచ్చారు. ఆయన దేశం నుంచి పారి పోయి ఏడు వారాలు అవుతోంది. అంటే సరిగ్గా 49 రోజులు అన్నమాట.
ఇదిలా ఉండగా గోటబయ రాజపక్సే వల్లే దేశం సర్వ నాశనం అయ్యిందని, ఆయన కాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి విపక్షాలు. మరో వైపు అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మార్చేసిన గోటబయకు దేశంలో అడుగు పెట్టే హక్కు లేదని వారంటున్నారు.
ఆయన కాలంలో దేశం సర్వ నాశనమైందన్నారు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఎన్నడూ లేని రీతిలో శ్రీలంక(Srilanka Crisis) తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది.
గోటబయ రాజపక్సే ఆయన కుటుంబీకులు శ్రీలంక వనరులను దోచుకున్నారని, దేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టారంటూ ధ్వజమెత్తారు. కొన్ని నెలలుగా తీవ్రమైన రాజకీయ సంక్షోభానికి కారణమైంది.
పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చారు. ఒక రకంగా ఆయన నివాసంపై దాడికి పాల్పడ్డారు. నిరాయుధ గుంపులు అధికారిక నివాసాన్ని ముట్టడించారు. చిందరవందరగా మార్చేశారు. జూలై మధ్యలో సైనిక ఎస్కార్ట్ తో శ్రీలంక పారిపోయారు.
మరో వైపు తను కోరుకున్న రణిలె విక్రమసింఘె ప్రస్తుతం శ్రీలంకకు దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Also Read : ప్రభుత్వాన్ని కూల్చేందుకు ట్రంప్ కుట్ర