Betting Apps: బెట్టింగ్ యాప్స్‌ పై దర్యాప్తు ముమ్మరం చేయడానికి ఐదుగురితో సిట్‌ ఏర్పాటు

బెట్టింగ్ యాప్స్‌ పై దర్యాప్తు ముమ్మరం చేయడానికి ఐదుగురితో సిట్‌ ఏర్పాటు

Betting Apps : ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి… కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న బెట్టింగ్ భూతాన్ని నియంత్రించేందుకు తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోన్న బెట్టింగ్ యాప్స్ కేసులను దర్యాప్తు వేగవంతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు బెట్టింగ్ యాప్స్‌(Betting Apps) దర్యాప్తుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు చేపట్టనుంది. సిట్‌ బృందంలో ఐజీ రమేశ్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్‌, డీఎస్పీ శంకర్‌ ఉన్నారు. ఈ దర్యాప్తుతో బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌ పై రెండు కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ పంజాగుట్టతోపాటు సైబరాబాద్ మియాపూర్‌లో కేసులు నమోదు అయ్యాయి. 25 మంది టాలీవుడ్, బాలీవుడ్, యూట్యూబర్స్, టీవీ యాంకర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు కేసులను కూడా సిట్‌ కు బదిలీ చేస్తూ ఆదేశాలు చేశారు. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సీట్‌ను డీజీపీ ఆదేశించారు.

Betting Apps – టాలీవుడ్ ను కుదిపేస్తున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారం

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌ వ్యవహారం టాలీవుడ్‌మను కుదిపేస్తున్నది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. సీనియర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్‌, గోపీచంద్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నటులు బెట్టింగ్‌ యాప్స్‌ని ప్రమోట్‌ చేసినట్లుగా ఆరోపించారు. ఓ టాక్‌ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్‌చలో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా… స్పెషల్‌ ఎపిసోడ్‌లో ప్రభాస్‌, గోపీచంద్‌ కనిపించారు.

Also Read : Anand Mahindra: తెలంగాణా ఐఏఎస్‌ అధికారిపై పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Leave A Reply

Your Email Id will not be published!