Kerala Governor : ప్రభుత్వ జోక్యాన్ని సహించను – గవర్నర్
కేరళ సీఎం పినయర్ విజయన్ పై ఆగ్రహం
Kerala Governor : కేరళలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. నువ్వా నేనా అన్నంత స్థాయికి చేరుకున్నాయి. సీఎం పినరయ్ విజయన్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇద్దరి మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.
గవర్నర్ కు(Kerala Governor) ప్రభుత్వంపై అజమాయిషీ వ్యవహరించే అధికారం లేదంటూ హెచ్చరించారు సీఎం. ఇద్దరి మధ్య తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్శిటీల వీసీలను తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై వీసీలు గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
ఈ తరుణంలో గవర్నర్ కు వీసీలను తొలగించే అధికారం లేదంటూ స్పష్టం చేశారు. ఆయన కేవలం కోర్టుకు సేఫ్ గార్డ్ గా ఉండాలని కానీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదంటూ మండిపడ్డారు పినరయ్ విజయన్. పదే పదే కావాలని గవర్నర్ తమను టార్గెట్ చేయడం మానుకోవాలని సూచించారు సీఎం.
ఇదే సమయంలో ఈ గవర్నర్ తమకు వద్దంటూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీనిపై గవర్నర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాజ్యాంగబద్దంగా నియమితులైన వ్యక్తినని, తనను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉండదన్నారు.
రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందన్నారు. యూనివర్శిటీలను నడిపే బాధ్యత వీసీలకు ఉంటుందని , కానీ రాజకీయాలు చేసేందుకు కాదన్నారు.
Also Read : మంత్రి కామెంట్స్..క్షమాపణ చెప్పిన దీదీ