Satya Pal Malik : గవర్నర్ ఆరోపణలపై స్పందించిన సర్కార్
సీబీఐ విచారణకు జమ్మూ సర్కార్ సిఫారసు
Satya Pal Malik : దేశంలో ఆయనో ఓ సంచలనం. భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్(Satya Pal Malik) నిత్యం వార్తల్లో ఉంటున్నారు. నిజాలను, వాస్తవాలను ఆయన కుండ బద్దలు కొడతారు.
మాలిక్ ఏకంగా మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. గత కొంత కాలంగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీతో పాటు సత్య పాల్ మాలిక్ (Satya Pal Malik)సీరియస్ కామెంట్స్ చేశారు. తాజాగా గవర్నర్ చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిఫారసు చేసింది జమ్మూ సర్కార్.
సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాము రెడీగా ఉన్నామని స్పష్టం చేసింది. తాను గవర్నర్ గా ఉన్న సమయంలో పెండింగ్ లో ఉన్న రెండు ఫైల్స్ క్లియర్ చేస్తే తనకు రూ. 300 కోట్ల రూపాయలు లంచం ఇచ్చేందుకు ఓకే చెప్పారని కానీ తాను ఒపపు కోలేదన్నారు.
గవర్నర్ సత్య పాల్ మాలిక్ అప్పట్లో చేసిన ఈ కామెంట్స్ కలకలం రేపాయి దేశ వ్యాప్తంగా. ఆ రెండు ఫైల్స్ లలో ఒక ఫైల్ ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించి అని, ఇంకో ఫైల్ ఆర్ఎస్ఎస్ చెందిన సీనియర్ నాయకుడంటూ కుండలు బద్దలు కొట్టారు.
ఈ ఫైల్స్ మాలిక్ జమ్మూ కశ్మీర్ కు గవర్నర్ గా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రతిపాదనలను తాను నిర్దద్వందంగా తిరస్కరించానని చెప్పారు.
ఈ విషయంపై విచారణ జరపాలని, నిష్పక్షపాతంగా ఉండాలని జమ్మూ కశ్మీర్ సర్కార్ సీబీఐని కోరింది.
Also Read : ఆయుష్మాన్ పథకం రోగుల పాలిట శాపం