Governor RTC Bill Approved : ఆర్టీసీ కార్మికులకు ఖుష్ కబర్
బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్
Governor RTC Bill Approved : ఎట్టకేలకు రాష్ట్ర గవర్నర్ దిగి వచ్చారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఫలించింది. రాష్ట్ర సర్కార్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తీసుకు వచ్చారు కేసీఆర్. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ప్రవేశ పెట్టడం, తీర్మానం చేయడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ తరపున వెల్లడించారు. ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులేనని ప్రకటించారు. విధి విధానాలను తయారు చేస్తామని, బిల్లును రూపొందించి ఆమోదం కోసం గవర్నర్ తిమిళి సై సౌందర రాజన్ కు పంపిస్తామని స్పష్టం చేశారు.
Governor RTC Bill Approved Viral
ఈ తరుణంలో రాష్ట్ర సర్కార్ హుటా హుటిన ఆర్టీసీ బిల్లును రాజ్ భవన్ కు పంపించింది. తెలంగాణ సమావేశంలోనే బిల్లును పాస్ చేయాల్సి ఉంటుంది. త్వరలోనే కేసీఆర్ ఎన్నికల కోసం వెళ్లనున్నారు. ఈ తరుణంలో ఇదే ఆఖరి అసెంబ్లీ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఊహించని రీతిలో ట్విస్ట్ ఇచ్చారు గవర్నర్.
బిల్లుపై అనుమానాలు ఉన్నాయని కొర్రీ పెట్టారు. దీంతో ఆర్టీసీ సంస్థ మొత్తం ఇవాళ బంద్ కు పిలుపునిచ్చింది. 44 వేల మంది పని చేస్తున్న వారంతా రోడ్డుపైకి వచ్చారు. ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు. చివరకు వివరణ ఇవ్వడంతో సంతృప్తి చెందిన గవర్నర్ ఎట్టకేలకు సంతకం చేశారు(Governor RTC Bill Approved). ఆ మేరకు బిల్లును అసెంబ్లీకి పంపించారు .
Also Read : KTR : చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి