Governor Telangana : మ‌హిళా గ‌వ‌ర్న‌ర్ ప‌ట్ల స‌ర్కార్ వివ‌క్ష

త‌మిళ సై సౌంద‌ర రాజ‌న్ కామెంట్స్

Governor Telangana : తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మ‌రోసారి రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేశారు. మ‌హిళ‌లనైన త‌న ప‌ట్ల తెలంగాణ ప్ర‌భుత్వం వివ‌క్ష చూపుతోందంటూ మండిప‌డ్డారు.

అంతే కాదు త‌న‌కు విలువ ఇవ్వ‌క పోయినా రాష్ట్రానికి ప్ర‌థ‌మ పౌరురాలిగా ప్రోటోకాల్ పాటించాల‌న్నారు. కానీ దానిని కూడా పాటించ‌కుండా అవ‌మానానికి గురి చేస్తున్నారంటూ వాపోయారు.

గురువారం మీట్ ది ప్రెస్ లో రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై(Governor Telangana) మాట్లాడారు. మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. అధికారిక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలో హెలికాప్ట‌ర్ కూడా ఇవ్వలేద‌న్నారు.

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆమె మాట్లాడారు. మ‌హిళ అయినందు వ‌ల్ల‌నే ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తాను అనుకుంటున్న‌ట్లు మండిప‌డ్డారు.

ఇందుకు సంబంధించి చాలా ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయ‌ని అన్నారు. గ‌ణతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేక పోవ‌డం, జెండాను ఎగుర వేయడాన్ని తిర‌స్క‌రించ‌డం చేశారంటూ ఆరోపించారు.

తాను ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని అనుకున్నప్పుడ‌ల్లా క‌చ్చితంగా ఏదో ఒక అడ్డంకి త‌న‌కు ఉండేద‌న్నారు. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌ను సంద‌ర్శించాల‌ని అనుకున్నా.

రోడ్డు ప్ర‌యాణం ఎనిమిది గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. హెలికాప్ట‌ర్ కోసం ప్ర‌భుత్వాన్ని అడిగా. స్పంద‌న రాలేదు. చివ‌ర‌కు కారులో వెళ్లాల్సి వ‌చ్చింద‌న్నారు.

ప్ర‌భుత్వం కావాల‌ని అడుగ‌డుగునా ఇబ్బందులు క‌లిగిస్తోంది. కానీ తాను కింది నుంచి వ‌చ్చిన దానిన‌ని చెప్పారు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో మౌలిక వ‌స‌తులు క‌ల్పించాలన్నారు.

కొన్ని చోట్ల పిల్ల‌ల‌ను చూసి తాను కంట త‌డి పెట్టాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు గ‌వ‌ర్న‌ర్.

Also Read : ఆ డివైజ్ లు అమ్మొద్ద‌ని కేంద్రం ఆదేశం

Leave A Reply

Your Email Id will not be published!