Brahmotsavam : వైభవోపేతం బ్రహ్మోత్సవం
చిన్న శేష వాహనంపై ఊరేగిన దేవ దేవుడు
Brahmotsavam : తిరుపతిలో కొలువు తీరిన శ్రీ గోవింద రాజ స్వామి వారి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం స్వామి వారు చిన్న శేష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల దాకా వాహన సేవ నిర్వహించారు. గజరాజులు ముందు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తించారు. మంగళ వాయిద్యాలతో , కళా ప్రదర్శనల నడుమ స్వామి వారి వాహన సేవ వైభవంగా జరిగింది.
చిన్న శేష వాహనం స్వామి వారి వ్యక్త రూపమైన పాంచ భౌతిక ప్రకృతికి సంకేతం. ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి , జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించే శక్తి. స్వామి విశ్వాన్ని రక్షించే వాడు కనుక శేషునిపై తానొక్కడే విహరించారు.
ఐదు తలల చిన్న శేషుని దర్శనం మహా శ్రేయ ప్రదంగా భావిస్తారు భక్తులు. శేష వాహన ఉత్సవాన్ని దర్శిస్తే దుష్ట శక్తుల నుండి రక్షించబడతారని ప్రతీతి. కుండలినీయోగ సిద్దించి సుఖ శాంతులు కలుగుతాయని నమ్మకం. ఉదయం 9.30 నుండి 10.30 గంటల దాకా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామి వారి ఉత్సవం జరిగింది. అనంతరం తిరుమంజనం నిర్వహించారు.
Also Read : Rahul Gandhi Nehru
