Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాలా మాతృమూర్తి ఐవీఎఫ్ పై నివేదిక కోరిన కేంద్రం !
సిద్ధూ మూసేవాలా మాతృమూర్తి ఐవీఎఫ్ పై నివేదిక కోరిన కేంద్రం !
Sidhu Moose Wala: దివంగత పంజాబ్ ర్యాపర్ సిద్దు మూసేవాలా తల్లిదండ్రులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సిద్దూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా మార్చి 17న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇదే విషయాన్ని సిద్ధూ తండ్రి 60 ఏళ్ల బాల్కౌర్ సింగ్…సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ‘శుభ్‌దీప్ (సిద్దు మూసేవాలా(Sidhu Moose Wala) అసలు పేరు)ను ప్రేమించిన లక్షలాది మంది ఆశీర్వాదాలతో అతడికి ఓ తమ్ముడు పుట్టాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఙతలు తెలియజేస్తున్నాను’ అని ఆయన రాసుకొచ్చాడు.
Sidhu Moose Wala Family….
అయితే ఈ ట్రీట్ మెంట్ కు వయో పరిమితి ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై నివేదిక సమర్పించాలంటూ పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. నోటీసులో అసిస్టెడ్ రీప్రోడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం 2021 ప్రకారం… ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ పొందాలంటే మహిళ వయస్సు 21-50 సంవత్సరాలు ఉండాలని పేర్కొంది. మరోవైపు తనకు పుట్టిన రెండో బిడ్డ విషయంలో పంజాబ్ ప్రభుత్వం వేధిస్తోందని సిద్ధూ మూసేవాలా(Sidhu Moose Wala) తండ్రి బాల్ కౌర్ సింగ్ ఆరోపించారు. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన చిన్నారికి సంబంధించిన పత్రాలను అందించాలని పంజాబ్ ప్రభుత్వం కోరిందని తెలిపారు.
ప్రముఖ పంజాబ్ ర్యాపర్ సిద్దు మూసేవాలాను 2022 మే 29న దారుణంగా హత్య చేశారు. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా… మార్గం మధ్యలో దుండగులు అతడిని అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక్కగానొక్క కొడుకు ఇక లేడన్న నిజాన్ని సిద్దూ పేరెంట్స్ బాల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ జీర్ణించుకోలేకపోయారు. అయితే లెజెండ్స్‌కు చావు ఉండదని నమ్మారు. తన కొడుకును మళ్లీ చూసుకోవాలని మురిసిపోయారు. ఈ క్రమంలో 58 ఏళ్ల వయసులో సిద్దు తల్లి చరణ్ కౌర్ ఐవీఎఫ్ ద్వారా తల్లి అయింది.
Also Read : APPSC: గ్రూప్-1 మెయిన్స్ సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు స్టే !